వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడ్ ఆఫ్ ది నేషన్, బెస్ట్ సీఎం: కేసీఆర్, మమతకంటే యోగి ఆదిత్యనాథ్‌కే ఎక్కువ మార్కులు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్‌సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అత్యదిక మార్కులు కొట్టేశారు. యూపీలోని నలభై శాతానికి పైగా ప్రజలు ఆయనను ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రశంసించారు. యోగి పాలనతో ఎక్కువ మంది ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లుగా ఈ సర్వేలో తేలింది.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కు యోగి ఆదిత్యనాథ్ దాదాపు రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి అయ్యారు. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా, ఇండియా టుడే వచ్చే ఎన్నికలపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ఆయా ముఖ్యమంత్రుల పాలనపై సర్వే చేసింది.

ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?

దేశంలోనే యోగి అత్యుత్తమం

దేశంలోనే యోగి అత్యుత్తమం

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌లో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ప్రజల్లో 40 శాతం మంది యోగి ఆదిత్యనాథ్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు, దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఈయనే బెస్ట్ అని వారు అభిప్రాయపడ్డారు. 2017 ఆగస్ట్ నెలలోను ఓసారి సర్వే చేశారు. అప్పటి కంటే యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆయనను ప్రచారానికి వినియోగించుకుంటోంది.

 కేసీఆర్ సహా వీరిలో యోగి బెస్ట్

కేసీఆర్ సహా వీరిలో యోగి బెస్ట్

బెస్ట్ సీఎం ఆప్షన్‌లలో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్లు ఉన్నాయి. ఇందులో బెస్ట్ సీఎం ఎవరు అని ప్రశ్నించగా.. యోగి ఒక్కరికే నలభై మంది ఓటు వేశారు.

యోగి ఆదిత్యనాథ్ పై సంతృప్తి ఇలా

యోగి ఆదిత్యనాథ్ పై సంతృప్తి ఇలా

2017లో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో యోగి ఆదిత్యనాథ్‌ను ముప్పై శాతం మంది ప్రజలు బెస్ట్ సీఎంగా పేర్కొన్నారు. అయితే 2018లో ఇది 28 శాతానికి పడిపోయింది. కొద్ది రోజుల క్రితం చేసిన సర్వేలో 42 శాతం మంది ప్రజలు యోగి ది బెస్ట్ సీఎం అని పేర్కొన్నారు. తాజాగా సర్వేలో ఆయనకు 40 శాతం మంది ఓటేశారు.

 మొత్తంగా 57 శాతం మంది సంతృప్తి

మొత్తంగా 57 శాతం మంది సంతృప్తి

ఉత్తర ప్రదేశ్‌లో 2478 మంది సర్వేలో పార్టిసిపేట్ చేశారు. 57 శాతం మంది ప్రజలు యోగి ఆదిత్యనాథ్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. ఇందులో 40 శాతం మంది సంతృప్తిగా ఉన్నామని చెప్పగా, 17 శాతం మంది చాలా సంతృప్తిగా ఉన్నామని తెలిపారు. 15 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 27 శాతం మంది ఏమీ తేడా లేదన్నారు. ఒక్క శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath can smile. The people of Uttar Pradesh appear to be happy with his government. Nearly two years into governing India's largest states, Yogi has managed to woo his electorate. The other options included Telangana CM K Chandrashekar Rao, West Bengal CM Mamata Banerjee, Odisha CM Naveen Patnaik and Bihar CM Nitish Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X