వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్రాస్ ఘటనలో మలుపు: ఎస్పీ, డీఎస్పీపై వేటు - యోగి ఆదేశం - ఢిల్లీలోనూ భారీ నిరసనలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామానికి చెందిన 19ఏళ్ల దళిత యువతిపై హత్యాచారం, ఆమె మృతదేహాన్ని కనీసం బంధువులకు అప్పగించకుండా పోలీసులే తగులబెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు..

కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం -కూతుళ్లను బలవంతపెట్టిన తల్లి - ఎస్పీ శ్వేత సీరియస్కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం -కూతుళ్లను బలవంతపెట్టిన తల్లి - ఎస్పీ శ్వేత సీరియస్

హత్రాస్ ఎస్పీపై వేటు..

హత్రాస్ ఎస్పీపై వేటు..


హత్రాస్ జిల్లాలో దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులం యువకులు నలుగురు అత్యాచారానికి పాల్పడి, ఆమె వెన్నుపూస, ఎముకలు విరిగ్గొట్టడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయింది. 14 రోజులపాటు సరైన వైద్యం అందకపోవడం ఒక ఎత్తయితే, ఆమె మృతదేహాన్ని హడావుడిగా కాల్చేసిన పోలీసులు.. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ప్రకటించడం దేశాన్ని షాక్ కు గురిచేసింది. కాగా, మొత్తం ఎపిసోడ్ లో డ్యూటీలు సరిగా నిర్వర్తించని కారణంగా హత్రాస్ జిల్లా ఎస్పీ విక్రాంత్ వీర్ పై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు..

బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్

హత్రాస్ కలెక్టర్ ను వదిలేశారేం?

హత్రాస్ కలెక్టర్ ను వదిలేశారేం?

దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి హత్రాస్ జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ రామ్ షాబ్ద్, ఇనిస్పెక్టర్ దినేశ్ వర్మ, ఎస్ఐ జగ్ వీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ మహేశ్ పాల్ తదితరులు కూడా సస్పెండ్ అయ్యారు. ఘటన జరిగిన 20 రోజుల తర్వాతగానీ నేరుగా స్పందించిన సీఎం యోగి.. మహిళల భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలకు హానీ చేయాలనుకునే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించిన కొద్ది గంటలకే పోలీస్ అధికారులపై వేటు నిర్ణయం వెలువడింది. అయితే, రాత్రికిరాత్రే యువతి మృతదేహం తగులబెట్టాలని ఆదేశాలిచ్చిన హత్రాస్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ లక్స్ కర్ కు మాత్రం యోగి మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Recommended Video

హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
ఢిల్లీలో హత్రాస్‌పై నిరసనలు..

ఢిల్లీలో హత్రాస్‌పై నిరసనలు..

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతిపై అత్యాచారం, ఆమె మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా తగులబెట్టం, ఆ తర్వాత రేప్ జరగలేదని చెప్పడం లాంటి వరుస పరిణామాలపై బీజేపీ నేతలు సహా విపక్షాలన్నీ సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం రాత్రి భారీ నిరసన చేపట్టారు. భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో లెఫ్ట్ పార్టీల నేతలతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలుపంచుకున్నారు.

English summary
The Uttar Pradesh government has suspended Hathras superintendent of police (SP), deputy superintendent of police (DSP), station inspector and two other officials over the gangrape and death of the 19-year-old Dalit woman. Delhi CM Arvind Kejriwal joins protest at Jantar Mantar, with Left leaders, Bhim Army chief Chandrashekhar Azad. Kejriwal says there should be no politics on Hathras issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X