వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యంగ్ ఇండియా: 65 శాతం ప్రజల వయస్సు 35 సంవత్సరాల్లోపే: ఆ 6 రంగాల్లో ఛాంపియన్ భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ యంగ్ ఇండియాగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది ప్రజల వయస్సు 35 సంవత్సరాలలోపేనని అన్నారు. యంగ్ ఇండియా ఎలాంటి అద్భుతాలనైనా సృష్టించగలదని అన్నారు. ఫార్మా, పరిశోధన రంగాల్లో తాము ఫ్రంట్ రన్నర్లుగా నిలిచామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోందని, పెట్టుబడులను పెట్టడానికి ఇదే సువార్ణావకాశమని ఆయన అన్నారు.

కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం: 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు: మోడీ

అమెరికా సమ్మిట్‌లో..

అమెరికా సమ్మిట్‌లో..

అమెరికా, భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకోపన్యాసం ఇచ్చారు. పలు కీలక అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తోందనే విషయాన్ని ఆయన తన స్పృశించారు. ఈ సమ్మిట్ వల్ల వ్యాపారం, వాణిజ్యం, విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, దౌత్యం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం కొనసాగుతోన్న సంబంధాలు మరింత బలోపేతమౌతాయని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్, లోకల్ టు గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల గురించి వివరించారు.

ఆరు రంగాల్లో ఛాంపియన్..

ఆరు రంగాల్లో ఛాంపియన్..

ఆటమిక్ ఎనర్జీ, డిఫెన్స్, స్పేస్, కోల్, పవర్, రైల్వేలు వంటి రంగాల్లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిందని అన్నారు. మొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్.. వంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్‌లో ఉన్నామనీ మోడీ చెప్పారు. కరోనా సృష్టించిన సంక్షోభ పరిస్థితులను తాము అవకాశాలుగా మలచుకుంటున్నామని అన్నారు. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా భారత్‌ను తీర్చిదిద్దతున్నామని మోడీ తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌లల్లో సంస్కరణలను తీసుకొచ్చామని, ఫలితంగా ఈ రంగంలోనూ అనేక అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్ మహోద్యమంలా

ఆత్మనిర్భర్ భారత్ మహోద్యమంలా

భారత్‌లో ఆత్మనిర్భర్ భారత్‌ను మహోద్యమంలా చేపట్టామని ప్రధానిమంత్రి వివరించారు. లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో పనిచేస్తున్నామని చెప్పారు. 130 కోట్ల మంది ప్రజలు ఆత్మనిర్భర్ భారత్ అనే ఏకైక నినాదాన్ని వినిపిస్తున్నారని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సువర్ణావకాశమని మోడీ పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. కరోనా వైరస్.. అనేక సవాళ్లను విసిరినప్పటికీ.. పలు రంగాలపై ప్రభావాన్ని చూపినప్పటికీ.. ప్రజల నైతిక స్థైర్యం చెక్కు చెదరలేదని, ఆత్మనిర్భర్ భారత్‌కు ఇదే నిదర్శనమని అన్నారు.

పరిమిత వనరులతోనే

పరిమిత వనరులతోనే

భారత్‌లో అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే తాము అద్భుతాలను సృష్టించామని మోడీ అన్నారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశంగా భారత్ ఆవిర్భవించిందని, పరిశ్రమలకు తాము ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నామనేది దీనితో స్పష్టమౌతోందని అన్నారు. భారత్.. సవాళ్లను ఎలా ఎదుర్కొంటోందనేది దీన్ని చూసి ప్రపంచం తెలుసుకుంటోందని చెప్పారు. కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలో పేదలను రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చామని మోడీ స్పష్టం చేశారు.

Recommended Video

PM Cares Fund కి తొలి విరాళం గా 2.25 లక్షలు ఇచ్చిన PM Modi || Oneindia Telugu
రాజకీయ స్థిరత్వం..

రాజకీయ స్థిరత్వం..

దేశంలో రాజకీయ స్థిరత్వం ఏర్పడిందని ప్రధానమంత్రి మోడీ అన్నారు. ప్రభుత్వం తీసుకుంటోన్న విధానపరమైన నిర్ణయాలను ఆరేళ్లుగా చెక్కు చెదరకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే అకాంక్ష గల ప్రభుత్వం భారత్‌కు సరైన దిశానిర్దేశాన్ని సూచిస్తోందని అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం లభించదని అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి భారత్‌కు రావాలని మోడీ ఆహ్వానించారు.

English summary
For challenges in India, you have a govt that believes in delivering results, for which ease of living is as important as ease of doing business. You are looking at a young country with 65% population less than 35 years old: PM Modi at US-India Strategic Partnership Forum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X