వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధారణ డిగ్రీతో టీసీఎస్‌లో ఉద్యోగం పొందవచ్చు: ఇందుకు అర్హతలేమంటే.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాధారణ డిగ్రీ చదివిని విద్యార్థులకు టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరో తీపి కబురునందించింది. ఈ విద్యాసంవత్సరంలో బీఏ, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు కూడా తమ కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం జాతీయ అర్హత పరీక్ష నిర్వహించనుంది.

తొలి ప్రయత్నంలోనే..

తొలి ప్రయత్నంలోనే..

2019-20 విద్యా సంవత్సరంలో రెగ్యూలర్ విధానంలో బీఏ, బీకాం, బీఎస్సీ ఆఖరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవడానికి అర్హులు.

విద్యాభ్యాసం మొత్తంలో రెండేళ్ల కంటే ఎక్కువగా గ్యాప్ ఉండకూడదు. పెండింగ్ బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. 10, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు తొలి ప్రయత్నంలోనే పూర్తి చేసి ఉండాలి.

పరీక్ష ఇలా..

పరీక్ష ఇలా..

జాతీయ అర్హత పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 50 నిమిషాల వ్యవధిలోనే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీలో 10 ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్-4, లాజికల్ రీజనింగ్-12, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-12, డేటా ఇంటర్ ప్రిటేషన్-12 చొప్పున ప్రశ్నలు ఉంటాయి.

వచ్చే ఏడాది మే నుంచి ఉద్యోగంలో..

వచ్చే ఏడాది మే నుంచి ఉద్యోగంలో..

ఇంగ్లీష్ గ్రామర్‌లో ప్రాథమిక పరిజ్ఞానం, వ్యాక్య నిర్మాణం పరిశీలించే ప్రశ్నలు అడుగుతారు. డిష్కషన్, విశ్లేషణ పరిజ్ఞానం, తదితర ప్రశ్నలు అడుగి అవకాశం ఉంది.

పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో విజయవంతమైతే 2020, మే నుంచి టీసీఎస్ కంపెనీలో విధుల్లోకి తీసుకుంటారు.

మరిన్ని వివరాల కోసం..

మరిన్ని వివరాల కోసం..

ఇప్పటికే టీసీఎస్ వెబ్‌సైట్‌లో నమూనా పరీక్షను అందుబాటులో ఉంచారు. పరీక్ష విధానం, ప్రశ్నలతీరు, మరింత సమాచారం ఆ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే తెలుసుకోవచ్చు. కాగా, పరీక్షలో నెగ్గి ఎంపికైన వారికి కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్(సీబీఓ), బ్యాంకింగ్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్(బీఎఫ్ఎస్ఐ), లైఫ్ సైన్సెస్ విభాగాల్లో శిక్షణ అందించి శాశ్వత ప్రతిపాదికన విధుల్లోకి తీసుకుంటారు.

English summary
You can get job in TCS with regular Degree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X