వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదికొక్కసారి సిబిల్ స్కోరు, రిపోర్టు ఉచితం.. తెలుసుకోండిలా!

సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్కరి రుణ చరిత్రను సమగ్రంగా తెలియజేసేది. సిబిల్ సంస్థ ఏడాదికోసారి తమ క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుసుకునే అవకాశాన్ని ప్రతి పౌరుడికి ఇప్పుడు ఉచితంగా కల్పిస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సిబిల్ స్కోర్ అనేది ప్రతి ఒక్కరి రుణ చరిత్రను సమగ్రంగా తెలియజేసేది. రుణం ఇవ్వడానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ముందుగా చూసేది ఈ సిబిల్ స్కోరునే. కనీసం ఏడాదికోసారయినా మీ సిబిల్ స్కోర్ ను మీరు తెలుసుకోవాలి.

సిబిల్ సంస్థ ఏడాదికోసారి తమ క్రెడిట్ స్కోర్ ఎంతో తెలుసుకునే అవకాశాన్ని ప్రతి పౌరుడికి ఇప్పుడు ఉచితంగా కల్పిస్తోంది. ఇంతకీ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో, మన జీవితంలో దాని ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా? ఈ విషయాలు తెలుసుకునే ముందు 'సిబిల్' గురించి తెలుసుకోండి.

‘సిబిల్' గురించి...

‘సిబిల్' గురించి...

దేశ ప్రజల రుణ సమాచారాన్ని పొందుపరిచేందుకు 2000 సంవత్సరంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) ను ఏర్పాటు చేశారు. సిబిల్ తరహాలోనే సేవలు అందించే ఈక్విఫాక్స్, ఎక్స్ పీరియన్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. రుణాలు, క్రెడిట్ కార్డులకు చేసే చెల్లింపుల వివరాలను సేకరించడం ద్వారా సంబంధిత వినియోగదారుల క్రెడిట్ స్కోర్ ను ఈ సంస్థలు నిర్వహిస్తుంటాయి ఇవి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ దగ్గర రుణాలు తీసుకున్న వారి వివరాలను, చెల్లింపులను, విఫలమైతే ఆ వివరాలను ప్రతీ నెలా సిబిల్ వంటి సంస్థలకు తెలిజేస్తుంటాయి. వాటి ప్రకారం ఒక్కొక్కరి రుణ స్కోరును ఖరారు చేయడం, రిపోర్ట్ లను సిద్ధం చేయడం ‘సిబిల్' పని.

క్రెడిట్ స్కోరు అంటే..?

క్రెడిట్ స్కోరు అంటే..?

వ్యక్తుల రుణ సామర్థ్యాన్ని తెలియజేసేది.. క్రెడిట్ స్కోర్. అంటే.. ఒక వ్యక్తికి రుణం ఇస్తే తిరిగి చెల్లించగలరా? లేదా? అన్నది ఈ స్కోరు తెలియజేస్తుంది. ఒక వ్యక్తి సిబిల్ రిపోర్ట్ ఆ వ్యక్తి అప్పటి వరకు ఏవైనా రుణాలు తీసుకున్నారా? తిరిగి ఎలా చెల్లించారు? ఏవైనా రుణాలు ఎగ్గొట్టారా? లేదా ఆలస్యంగా చెల్లించారా? ఇలాంటి వివరాలన్నీ ఈ సిబిల్ రిపోర్టు తెలియజేస్తుంది.

స్కోర్ ఇంతుంటే అద్భుతం...

స్కోర్ ఇంతుంటే అద్భుతం...

సాధారణంగా 750 నుంచి 900 మధ్య ఉంటే దాన్ని అద్భుతమైన స్కోర్ కింద పరిగణిస్తారు. ఇది గతంలో రుణ చెల్లింపుల పరంగా మంచి చరిత్రను సూచిస్తుంది. రుణాలను బ్యాంకుల నుంచి సరసమైన వడ్డీ రేట్లకు పొందే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ స్కోరును బట్టి ఏ రుణాలకు అర్హులన్నది ఉంటుంది. మై సిబిల్ అకౌంట్ లో ఏ రుణాలకు రెడీగా ఆఫర్లున్నాయో కూడా తెలుస్తుంది. 700 - 750 మధ్యన ఉన్నా మంచి స్కోరుగానే పరిగణిస్తారు.

ఈ రేంజిలో ఉంటే రుణం కష్టమే...

ఈ రేంజిలో ఉంటే రుణం కష్టమే...

క్రెడిట్ స్కోర్ 550-700 మధ్యన ఉంటే తక్కువ స్కోరుగా పరిగణిస్తారు. లోగడ చెల్లింపులను సకాలంలో చేయకపోవడం వల్ల ఏర్పడే సమస్య ఇది. ఈ స్కోరున్న వారి విషయంలో ఆర్థిక సంస్థలు కూడా రుణం ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాయి. అధిక వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఇంతకంటే తక్కువ స్కోరుంటే మాత్రం రుణాలు లభించడం కష్టమే!

ఏడాదికొక్కసారి ఉచితంగా...

ఏడాదికొక్కసారి ఉచితంగా...

ఇటీవలి వరకు సిబిల్ స్కోర్ అనేది చార్జీ చెల్లిస్తేనే లభించేది. కానీ, ఏడాదిలో ఒక్కసారి వ్యక్తుల క్రెడిట్ హిస్టరీ రిపోర్ట్ ను ఉచితంగా అందించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని క్రెడిట్ కంపెనీలను ఆదేశించింది.

ముందుగా లాగిన్ అవండి...

ముందుగా లాగిన్ అవండి...

సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు ముందుగా https://www.cibil.com/freecibilscore సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఈ పేజీలోనే కింది భాగంలో ‘ఫ్రీ యాన్యుయల్ సిబిల్ స్కోర్ రిపోర్ట్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే తర్వాతి పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పాన్ నంబర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి, నియమ, నిబంధనలు అంగీకరిస్తున్నట్టు టిక్ చేసి సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

ఆథెంటికేషన్ సక్సెస్ ఫుల్ అయితేనే...

ఆథెంటికేషన్ సక్సెస్ ఫుల్ అయితేనే...

ఆ తరువాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సిబిల్ రిపోర్టులు తరచుగా పొందేందుకు చందాల వివరాలు ఉంటాయి. పెయిడ్ మెంబర్ షిప్ స్కీములు కనిపిస్తాయి. దాన్ని కాకుండా నో థ్యాంక్స్ అన్న బటన్ పై క్లిక్ చేస్తే.. మీరు తర్వాత పేజీకి వెళతారు. ఆథెంటికేషన్ సక్సెస్ ఫుల్ అన్న సందేశంతో మరో పేజీ ఓపెన్ అవుతుంది.

మై సిబిల్ లోకి లాగిన్ అవండి...

మై సిబిల్ లోకి లాగిన్ అవండి...

క్రెడిట్ రిపోర్ట్, సిబిల్ సేవల కోసం ‘మై సిబిల్' లో లాగిన్ అవ్వాలని కోరుతూ సందేశం కనిపిస్తుంది. లాగిన్ వివరాలు మెయిల్ ఐడీకి వచ్చి చేరతాయి. ఇందులో మై సిబిల్ పేజీ లింక్, వన్ టైమ్ పాస్ వర్డ్ ఉంటాయి. ఆ వివరాలతో ‘మై సిబిల్' లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వెంటనే కొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకునే పేజీ కనిపిస్తుంది. కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న తరువాత తిరిగి ‘మై సిబిల్' పేజీలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

హోమ్ స్క్రీన్.. పైన మీ క్రెడిట్ స్కోర్

హోమ్ స్క్రీన్.. పైన మీ క్రెడిట్ స్కోర్

లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అందులో మీ స్కోరు ఎంతన్నది పై భాగంలో కనిపిస్తుంది. స్కోరు కింది భాగంలో వరుసగా పలు ఆప్షన్లు ఉంటాయి. వ్యూ రిపోర్ట్ భాగంలో వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ సమాచారం, ఖాతా సమాచారం (ప్రస్తుత, గత రుణ చరిత్ర), మీ క్రెడిట్ స్కోరు కావాలని అడిగిన సంస్థల వివరాలు వంటివి కనిపిస్తాయి.

వీటితో క్రెడిట్ స్కోరుకు నష్టం...

వీటితో క్రెడిట్ స్కోరుకు నష్టం...

రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోవడం, చెక్ బౌన్స్ అవడం, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో విఫలం కావడం, అన్ సెక్యూర్డ్ రుణాలైన క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ వంటి వాటిని అధికంగా తీసుకోవడం, వేరొకరికి రుణం విషయంలో హామీదారుగా ఉండి, వారు చెల్లించలేని పరిస్థితుల్లో తప్పించుకోవడం, క్రెడిట్ కార్డుపై ఉన్న అప్పు లిమిట్ ను పూర్తిగా వాడేయడం.. ఇలాంటి చర్యలన్నీ మీ క్రెడిట్ స్కోరు తగ్గేలా చేస్తాయి.

స్కోరును ఇలా పెంచుకోవచ్చు...

స్కోరును ఇలా పెంచుకోవచ్చు...

క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో, రుణానికి సంబంధించి నెలవారీ వాయిదాల చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీఫాల్ట్ అవకుండా చూసుకోండి. వాయిదా చెల్లింపులను నిర్ణీత గడువు లేదా ఆ లోపే గుర్తుంచుకుని మరీ క్రమం తప్పకుండా చెల్లించాలి. చెల్లింపులను చెక్ ద్వారా చేసేలాగయితే కనీసం గడువు తేదీకి పది రోజుల ముందే అది ప్రారంభించాలి. ఎందుకుంటే మీరిచ్చే చెక్ క్లియర్ అవడానికి సమయం తీసుకుంటుంది. ఇలా జాగ్రత్త పడడం వల్ల ఒకవేళ మీరిచ్చిన బౌన్స్ అయినా గడువు దాటకుండా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఒకేసారి అధిక రుణాలు.. వద్దు

ఒకేసారి అధిక రుణాలు.. వద్దు

ఒకేసారి అధిక సంఖ్యలో రుణాలు తీసుకోవద్దు. మంచి స్కోరున్న వారికి అధిక మొత్తంలో రుణం, ఒకటికి మించిన రుణాలు ఇచ్చేందుకు సంస్థలు రెడీగా ఉంటాయి. కానీ, తీసుకునే ముందు జాగ్రత్త పాటించాలి. ఒకరి పేరుతోనే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ వంటి అన్ సెక్యూర్డ్ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దు. ఏక కాలంలో రెండు కంటే ఎక్కువ రుణాలను తీసుకోకండి. రుణం తీర్చివేయడం ముగిసిన ప్రతీసారీ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒక రుణం తీర్చిన తర్వాత మరో రుణం పొందడానికి మధ్య కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల విరామం ఉండేలా చూసుకోండి.

మొహమాటానికి పోతే...

మొహమాటానికి పోతే...

బంధువులు, స్నేహితులు మరెవరైనా కానీయండి. మొహమాటానికి పోయి రుణం విషయంలో హామీదారుడిగా ఉండకండి. క్రెడిట్ కార్డుల లిమిట్ ను పూర్తిగా కాకుండా కొంత మొత్తం వరకే వాడుకోవాలి. దీన్ని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటారు. అంటే.. అవకాశం ఉన్న మొత్తంలో వాడుకునే మొత్తం అని అర్థం. రుణం చెల్లింపుల విషయంలో ఏదైనా సమస్య ఏర్పడితే సత్వరమే సానుకూలంగా పరిష్కరించుకోండి. లేదంటే ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది.

క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్త...

క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్త...

మీ సిబిల్ స్కోర్ పై క్రెడిట్ కార్డుల హిస్టరీ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రూ.50 వేల లిమిట్ ఉందనుకుంటే.. ప్రతీ నెలా పూర్తి మొత్తాన్ని వాడుకోకండి. ఎప్పుడూ 80 శాతం దాటకుండానే వినియోగించుకోవడం మంచిది. ఒకవేళ అంతకుమించి అవసరం అనుకుంటే కార్డు లిమిట్ ను పెంచుకుని తక్కువ వాడుకోవడం తెలివైన పని. 30 నుంచి 40 శాతం క్రెడిట్ లిమిట్ వినియోగం అన్నది మరీ మంచిది. రెండు క్రెడిట్ కార్డులున్నప్పుడు ఒక కార్డు వాడుతూ మరో కార్డు అసలు వాడకపోవడం కూడా మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డనేది లేకపోతే వెంటనే తీసుకుని దాని ద్వారా చెల్లింపులు చేయడం వల్ల మీకంటూ మంచి క్రెడిట్ హిస్టరీ ఏర్పడుతుంది.

ఎప్పుడూ సెటిల్ మెంట్ చేసుకోకండి...

ఎప్పుడూ సెటిల్ మెంట్ చేసుకోకండి...

రుణాలు బకాయి పడి ఉంటే దాన్ని సెటిల్ చేసుకోకుండా పూర్తిగా, ఆలస్యపు రుసుములు, వడ్డీలతో సహా చెల్లించడమే మంచిది. గృహ రుణం వంటి సెక్యూర్డ్ రుణాలతో సిబిల్ స్కోరు మెరుగవుతుంది. అదే కారు రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు రుణాలు సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

English summary
The Reserve Bank of India (RBI) has made it mandatory for all credit information agencies to provide a full credit report free of cost on request once in a calendar year to individuals whose credit history is available. This will come into force from 1 January 2017. Credit Report contains details of your credit history collated by a credit information company. At present, there are four such companies in India—Credit Information Bureau (India) Ltd (Cibil), Equifax Credit Information Services Pvt. Ltd, Experian Credit Information Co. of India Pvt. Ltd and High Mark Credit Information Services Pvt. Ltd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X