వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త! ఇకనుంచి వాటి అవసరం లేదు!!

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గురువారం తన ఖాతాదారులకు ఓ శుభవార్త చెప్పింది. అనారోగ్యం పాలైనపుడు చికిత్సకు అవసరమైన నగదు కోసం స్వీయ ప్రకటన సరిపోతుందని వెల్లడించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గురువారం ఓ శుభవార్త చెప్పింది. ఖాతాదారులు అనారోగ్యం పాలైనపుడు చికిత్సకు అవసరమైన నగదు కోసం ఇతరత్రా ధ్రువీకరణపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్వీయ ప్రకటన సరిపోతుందని వెల్లడించింది.

ఈ మేరకు ఈనెల 25న కార్మికశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇదివరకు వైద్య ఖర్చుల కోసం ఖాతాదారులు తాము పనిచేస్తున్న సంస్థ నుంచి ఆమోదం పొందినట్లు లేఖ లేదా మెడికల్‌ సర్టిఫికెట్‌ జత చేయాల్సి వచ్చేది.

epf

తాజా నిర్ణయంతో పీఎఫ్‌ ఖాతాదారులకు ఆ ఇబ్బందులు తప్పాయి. 'ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖాతాదారులకు మేలు జరగనుంది. ఇకపై తమ ఖాతా నుంచి నగదును పొందడానికి వారు ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు' అని ఈపీఎఫ్‌వో కమిషనర్‌ వి.పి.జాయ్‌ చెప్పారు.

English summary
New Delhi: Over four crore members of the retirement fund body EPFO can now withdraw funds from their EPF account for treatment of illness and purchasing equipment to deal with handicap without medical certificates. The Employees' Provident Fund Scheme 1952 is amended to do away with the requirement of submission of various certificates and proformas for seeking advance for treatment of illness and purchasing equipment required in case of physical disabilities. Now, the subscribers can seek fund withdrawal from their EPF account on various grounds by using a composite form along with a self-declaration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X