వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi clashes: ఆదేశాల కోసం చూడొద్దు, విధులు నిర్వర్తించడమే ఫస్ట్ ప్రయారిటీ, ఢిల్లీ అల్లర్లపై HC

|
Google Oneindia TeluguNews

ఈశాన్య ఢిల్లీలో జరుగుతోన్న ఘర్షణలకు సంబంధించి పిటిషన్‌ హస్తిన హైకోర్టు విచారణ చేపట్టింది. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్ సహా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలసిందే. పరిస్థితి చేయిదాటినప్పుడు కోర్టు ఆదేశాల కోసం ఎందుకు చూడటం.. వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా అని పోలీసులను ప్రశ్నించింది. ఆలస్యం చేయడంతో హింస ఎక్కువవుతుందనే ఉద్దేశంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో 10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. వారికి పరీక్షలు ఎప్పుడూ నిర్వహిస్తారనే అంశంపై 15 రోజుల్లో తెలియజేయాలని ఢిల్లీ విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో అల్లర్లతోపాటు న్యాయ విచారణ జరపాలని, ఆర్మీ మొహరింపు, బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది.

you don’t wait for court direction on delhi clashes: high court

ఎన్జీవో మానవ హక్కుల లా నెట్‌వర్క్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించనుంది. పిటిషన్ విచారణ సందర్భంగా హాజరయ్యే అవకాశం ఉందని హైకోర్టు ధర్మాసనానికి లాయర్ తెలియజేశారు.

ఢిల్లీ ఘర్షణలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం వరకు 13 మంది చనిపోగా.. బుధవారం మరో ఏడుగురు చనిపోయారు. జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు మృతిచెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర మంత్రివర్గానికి ఢిల్లీ పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించనున్నారు.

English summary
Delhi High Court says the police need not wait for the Court's direction and it should take action on its own, to calm the ongoing violence in Northeast Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X