వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: డేరాబాబా, హనీప్రీత్‌కు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం!

డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్‌ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌లకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపడం విశేషం.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్‌ రామ్ రహీమ్ సింగ్, ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌లకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపడం విశేషం. 'టాయిలెట్‌ డే' ప్రచారంలో భాగస్వాములు కావాలంటూ వారిద్దరినీ ఆహ్వానించింది ఐరాస. ఈ మేరకు ఐరాస తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది.

హనీప్రీత్‌పై రేప్, వారసుడి డిమాండ్‌కు లొంగిన డేరాబాబా! రహస్య సంతానానికి యత్నం?హనీప్రీత్‌పై రేప్, వారసుడి డిమాండ్‌కు లొంగిన డేరాబాబా! రహస్య సంతానానికి యత్నం?

 ఐరాసకే తెలియకే..

ఐరాసకే తెలియకే..

అయితే, డేరాబాబాతోపాటు హనీప్రీత్‌లు ప్రస్తుతం పోలీస్‌ కస్టడీలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి ఇంకా తెలియనట్లుంది. అందుకే నవంబర్‌ 19న ప్రపంచ ‘టాయిలెట్‌ డే'ను జరుపుతారనీ.. ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఐరాస వాటర్‌ బాడీ.. గుర్మీత్‌ను మంగళవారం ట్విట్టర్‌ ద్వారా కోరింది.

Recommended Video

ప్రశ్నలు సిద్ధం..డేరాబాబాతో ఆ సంబంధం నిజమా? హనీప్రీత్‌ తో మరో మహిళ..! | Oneindia Telugu
హనీప్రీత్‌కు నేడు..

హనీప్రీత్‌కు నేడు..

కాగా, గుర్మీత్‌కు జైలు శిక్ష పడటంతో ఆయన ట్విట్టర్‌ ఖాతాను బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం మరోసారి ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌కు ట్విట్టర్‌ ద్వారా ఆహ్వానం పంపింది ఐరాస

మద్దతు ఇస్తారంటూ..

మద్దతు ఇస్తారంటూ..

‘డియర్‌ హనీప్రీత్‌.. వరల్డ్‌ టాయిలెట్‌ డేకు మీరు, గుర్మీత్‌ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం' అంటూ ఐరాస వాటర్‌ ట్వీట్‌ చేసింది. కాగా.. హనీప్రీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన రోజే ఐరాస ఈ ట్వీట్లు చేయడం గమనార్హం. ఈ ట్వీట్లకు డేరా మద్దతుదారులు సంబరపడిపోతుంటే.. ఇతర నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.

 హనీప్రీత్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

హనీప్రీత్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 20ఏళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. డేరాబాబాకు సహాయంగా ఉన్న హనీప్రీత్ ఇన్సాన్‌పై.. అతడ్ని జైలు నుంచి తప్పించే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం హనీప్రీత్ ను పోలీసులు అరెస్ట్ చేసి డేరాబా అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు.

కాగా, నెటిజన్ల విమర్శల నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా విషయం తెలుసుకున్న ఐరాస.. తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం.

English summary
Gurmeet Ram Rahim Singh and Honeypreet Insan have been at the centre of a social media storm ever since the former’s conviction in a rape case, but on Wednesday, they were tagged in an unexpected tweet from the United Nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X