వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచకుల తగలబడతుంటే ఏం చేస్తున్నారు?: హర్యానా సర్కారుపై హోకోర్టు ఆగ్రహం

పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని .

|
Google Oneindia TeluguNews

హర్యానా: పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని శనివారం కోర్టు వ్యాఖ్యానించింది.

సంచలన తీర్పు: రేప్ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు, రెచ్చిన బాబా అనుచరులుసంచలన తీర్పు: రేప్ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు, రెచ్చిన బాబా అనుచరులు

సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా వారికి ప్రభుత్వం లొంగిపోయిందని న్యాయమూర్తి అన్నారు. గుర్మీత్‌ కోర్టుకు వెళ్తున్న సమయంలో అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.

You let the city burn for your political gains: HC to Khattar govt

పంచకుల తగలబడుతుంటే వీక్షకుల్లా చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ
పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా ఆపే ప్రయత్నం చేయలేదని మండిపడింది.
పంచకుల తగులబడటానికి కారణమైన ఇద్దరు గుర్మీత్‌ అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వారిపై దేశ ద్రోహం కేసు నమోదైంది.

అంతేగాక, గుర్మీత్‌ ఆస్తుల వివరాలను ఆగస్టు 29లోగా కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, పంచకుల సీబీఐ తీర్పుకు 72 గంటల ముందు నుంచే హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలను కూడా నిలిపివేసింది.

అయితే, డేరా అనుచరుల దుశ్చర్యల ముందు పోలీసు శక్తి సరిపోలేదు. కాగా, ప్రస్తుతం ఆర్మీ, పారామిలటరీ బలగాలు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం నుంచి అనుచరులను బయటకు తరలించేందుకు యత్నిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా, పంచకుల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఖట్టర్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పంచకులలో ఆందోళనకారులను కట్టడి చేయడంలో విఫలమైన నేపథ్యంలో పంచకుల డీసీపీని సస్పెండ్ అయ్యారు. కాగా, గుర్మీత్‌ను దోషిగా తేల్చిన న్యాయమూర్తికి భద్రత కల్పించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు ప్రత్యేక పోలీసుల బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.

English summary
The Punjab and Haryana High Court has pulled up the state government following the violence that erupted in Panchkula on Friday. You allow the city to burn for your political gains, the HC said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X