వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయిదేళ్లలో రూ.30 కంటే తక్కువకే పెట్రోల్

రానున్న నాలుగయిదేళ్లలో పెట్రోల్‌ను మీరు కేవలం రూ.30కి కొనుగోలు చేయవచ్చు. రూపాయి తగ్గితే రూ.2 పెరుగుతుంది పెట్రోల్.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రానున్న నాలుగయిదేళ్లలో పెట్రోల్‌ను మీరు కేవలం రూ.30కి, అంతకంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. రూపాయి తగ్గితే రూ.2 పెరుగుతుంది పెట్రోల్. అలాంటిది సగాని కంటే తక్కువగా పెట్రోల్ వస్తుందా? అంటే రానున్న కాలంలో అది వాస్తవ రూపం దాల్చుతుందంటున్నారు.

వచ్చే అయిదేళ్లలో పెట్రోలు ధర లీటరు రూ.30కు పడిపోయే అవకాశముంది. సాంకేతికత మరింత అడ్వాన్స్‌డ్ స్థాయికి చేరుకోవడం, పెట్రోలుపై ఆధారపడడాన్ని ప్రపంచం తగ్గించుకోవడంతో ఇంధన ధరలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా పేర్కొన్నారు.

గతంలో సోలార్ పవర్‌పై సెబా చెప్పింది అక్షరాలా నిజమైంది. కాబట్టి ఆయిల్ ధరల విషయంలోనూ కచ్చితంగా అదే జరిగి తీరుతుందంటున్నారు.

You may pay below Rs 30 for petrol in 5 years

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వినియోగం పెరగడం వల్ల ఆయిల్ ధరలకు డిమాండ్ తగ్గిపోతుందని, బ్యారెల్ చమురు ధర 25 డాలర్లకు పడిపోతుందని సెబా పేర్కొన్నారు.

2021-2020 మధ్య ఆయిల్ డిమాండ్ బాగా తగ్గిపోతుందని, 100 మిలియన్ బ్యారెల్స్ కాస్తా, 70 మిలియన్ బ్యారెల్స్‌కు చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల బ్యారెల్ చమురు ధర 25 డాలర్లకు పడిపోతుందని అంచనా వేశారు.

పాతకాలం నాటి పెట్రోలు వాహనాలను వాడడాన్ని ప్రజలు మానకపోయినా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్లు వాడకం భారీగా పెరుతుందని పేర్కొన్నారు. వీటిని కొనడంతో పాటు వినియోగించడం కూడా తేలికే అన్నారు. 2030 నాటికి 95 శాతం మంది ప్రజలు ప్రయివేటు కార్లను కలిగి ఉండరని, ఇది ఆటోమొబైల్ రంగంపై పెను ప్రభావం చూపిస్తుందని గతంలోనే సెబా చెప్పారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ఇండస్ట్రీని దెబ్బతీస్తాయన్నారు.

2030 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతుందని ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అంటే మరో పదిహేనేళ్ల తర్వాత దేశంలో ఒక్క పెట్రోలు, డీజిల్ వాహనం కూడా కొనుగోలు కాదని అంచనా వేశారు.

English summary
You may pay less than Rs 30 for petrol in the next five years. Tony Seba, an American futurist says emerging technology is going to reduce the world's dependence on petrol so much that prices will plummet. Seba is famous for predicting a boom in solar power when the prices used to be forbiddingly high, 10 times the prices today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X