వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షీనా హత్య: 1300 కోట్ల లావాదేవీలు? నన్నొదిలెయ్.. ఇంద్రాణికి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య వెనుక రూ.1300 కోట్ల ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా సీబీఐ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌తో ప్రేమాయణం కూడా మరో కారణం కావొచ్చని భావిస్తున్నారు.

ఈ కేసును సిబిఐ దర్యాఫ్తు చేస్తోంది. ఈ మేరకు వెయ్యి పేజీల ఛార్జీషీటును సిబిఐ దాఖలు చేసింది. షీనా బోరా హత్యకు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీయా లండన్‌లోనే పథకం పన్నినట్లు అందులో పేర్కొందని తెలుస్తోంది.

2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి లండన్ నుంచి ముంబై తిరిగి వచ్చింది. 24న మాజీ భర్త సంజయ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్‌తో కలిసి షీనాను కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేసిన విషయం తెలిసిందే. 25న ఆమె శవాన్ని రాయగఢ్ అటవీ ప్రాంతంలో కాల్చి పెట్టారు. 26న పీటర్ భారత్ తిరిగి వచ్చారు.

You Should Think About My Happiness, Sheena Bora Wrote To Indrani Mukerjea

షీనా కేసుతో నా తండ్రికి సంబంధంలేదు: రాహుల్

షీనా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియా భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాని అరెస్టు చేసి, కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసుతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదనీ పీటర్ కొడుకు రాహుల్ ముఖర్జియా చెప్పాడు. తన తండ్రిపై చేసిన ఆరోపణలు దారుణమన్నాడు.

నా సంతోషం గురించి ఆలోచించు: తల్లితో షీనాబోరా

ఓ తల్లిగా నీవు నా సంతోషం గురించి ఆలోచించాలని షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జియాకు గతంలో లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తనకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలని ఆమె తల్లితో చెప్పారని తెలుస్తోంది. నేను రాహుల్‌తో (ఇంద్రాణి మొదటి భర్త కొడుకు) సంతోషంగా ఉన్నానని ఆమె ఆ లేఖలో పేర్కొందని సమాచారం. ఈ లేఖ 2012 రాసినట్లుగా తెలుస్తోంది.

English summary
When gaps within the family widened over her dating her step-brother, Sheena Bora wrote to her mother Indrani Mukherjea about being allowed to take her own decisions, an indictment filed by the Central Bureau of Investigation has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X