వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడికల్ కాలేజ్ ఆసుపత్రి నర్సుల డ్రెస్సింగ్ రూంలో సీక్రెట్ కెమెరాలు, వీడియో, భార్య అక్కడే ఉద్యోగం!

|
Google Oneindia TeluguNews

చెన్నై/నాగర్ కోవిల్: ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు డ్రస్ లు మార్చుకుంటున్న సమయంలో ఓ కామాంధుడు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న స్మార్ట్ మొబైల్ ఫోన్ లో వీడియోలు తీశాడు. నర్సులు డ్రస్ లు మార్చుకుంటున్న సమయంలో ఆ నిందితుడు ఆ గదిలో ఏర్పాటు చేసిన మరో సీక్రెట్ కెమెరా సహాయంతో పక్కన ఉన్న మరో గదిలో నుంచి వీడియోలు తీశాడు. అదే ఆసుపత్రిలో నిందితుడి భార్య సైతం అసిస్టెంట్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నదని తెలసుకున్న సాటి నర్సులు, పోలీసులు షాక్ కు గురైనారు.

లవ్ మ్యారేజ్, మధ్యలో కాలేజ్ అమ్మాయి ఎంట్రీ, అక్రమ సంబంధం, ఏదో ప్లాన్, నిజంగానే చచ్చిపోయారు!లవ్ మ్యారేజ్, మధ్యలో కాలేజ్ అమ్మాయి ఎంట్రీ, అక్రమ సంబంధం, ఏదో ప్లాన్, నిజంగానే చచ్చిపోయారు!

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి

తమిళనాడులోని నాగర్ కోవిల్ లోని ఆచారిపల్లంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (మెడికల్ కాలేజ్) ఉంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఔట్ పేషంట్స్ (OP) విభాగం వద్ద ఉన్న భవనం పక్కనే ఆ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న నర్సులు విశ్రాంతి తీసుకుంటుంటారు.

నర్సులు దుస్తులు మార్చుకునే గది

నర్సులు దుస్తులు మార్చుకునే గది

ఔట్ పేషంట్స్ విభాగం భవనం పక్కనే ఉన్న మరో గదిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న నర్సులు దుస్తులు మార్చుకుంటారు. సాయంత్రం విధులు ముగించుకున్న నర్సులు నేరుగా దుస్తులు మార్చుకునే గదిలోకి వెళ్లారు. సాయంత్రం కావడంతో చాల మంది నర్సులు విధులు ముగించుకుని ఆ గదిలో దుస్తులు మార్చుకున్నారు.

చేతిలో సెల్ ఫోన్ తో!

చేతిలో సెల్ ఫోన్ తో!

దుస్తులు మార్చుకునే గది పక్కనే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న విషయం అక్కడ ఉన్న నర్సులు గమనించారు. వెంటనే ఆసుపత్రి సెక్యూరిటీ విభాగం సిబ్బంది, ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని చూడగా ఆ యువకుడు చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకుని అటూఇటూ సంచరిస్తున్న విషయం గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

నీకు ఇక్కడ ఏం పని?

నీకు ఇక్కడ ఏం పని?

ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని ఆచారిపల్లం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ యువకుడిని విచారణ చెయ్యగా అతను తమిళనాడులోని కన్యాకుమరికి చెందిన ప్రవీణ్ (30) అనే విషయం వెలుగు చూసింది. ప్రవీణ్ ప్రస్తుతం లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

సీక్రెట్ కెమెరాకు మొబైల్ ఫోన్ కు లింక్!

సీక్రెట్ కెమెరాకు మొబైల్ ఫోన్ కు లింక్!

ప్రవీణ్ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకుని పరిశీలించిన పోలీసులు షాక్ కు గురైనారు. అత్యాధునిక సెల్ ఫోన్ నుంచి నర్సులు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీశాడని పోలీసులు అన్నారు. నిందితుడు ప్రవీణ్ దగ్గర ఉన్న మొబైల్ ను దూరంగా ఉన్న ప్రాంతాలను జూమ్ చేసి వీడియోలు, ఫోటోలు తీసే టెక్నాలజీ ఉందని పోలీసులు అన్నారు. అంతే కాకుండా నర్సులు దుస్తులు మార్చుకునే గదిలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి దాని సహాయంతో ప్రవీణ్ మొబైల్ లో వీడియోలు తీశాడని పోలీసులు గుర్తించారు.

భార్య అక్కడే నర్సు

భార్య అక్కడే నర్సు

ప్రవీణ్ భార్య కూడా అదే ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నదని తెలుసుకున్న పోలీసులు, అక్కడ పని చేస్తున్న సాటి నర్సులు షాక్ కు గురైనారు. కామాంధుడు ప్రవీణ్ ఇంకా గతంలో ఇలాంటి వీడియోలు ఎన్ని తీశాడు, వాటిని ఎవరికైనా పంపించాడా ? సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడా ? అంట ఆచారిపల్లం పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
30 year old man arrested for taking videos of nurses near Nagarcoil in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X