వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చినమాట నెరవేర్చాడు: బామ్మలను తాతయ్యలను విమానంలో తీర్థయాత్రలకు తీసుకెళ్లాడు

|
Google Oneindia TeluguNews

ఎవరికైనా ఒక మాట ఇవ్వడం చాలా సులభం. అదే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది చాలా తక్కువ మంది మాత్రమే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు పంజాబ్‌కు చెందిన సారంగ్‌పూర్ గ్రామస్తుడు వికాస్ జ్యానీ. ఇంతకీ వికాస్ ఇచ్చిన మాట ఏమిటి.. ఆ మాట ఎవరికిచ్చారు... ఇంతకీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడా లేదా..?

విమానం పేరు వినడమే తప్ప చూడలేదు

విమానం పేరు వినడమే తప్ప చూడలేదు

అది పంజాబ్ రాష్ట్రంలోని అదమ్‌పూర్ జిల్లాలోని సారంగ్‌పూర్ అనే చిన్న గ్రామం. ఆ ఊరిలో ప్రజలు విమానం అనే పదాన్ని వినడమే తప్ప ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి ఆ గ్రామస్తులను ఏకంగా ఒక విమానం ఎక్కించి వారి స్వప్నాన్ని నిజం చేశాడు అదే గ్రామానికి చెందిన వికాస్ జ్యాని అనే యువకుడు. అసలు విమానం జన్మలో దగ్గరనుంచి చూడలేమనుకుంటున్న తమకు విమానం చూపించడమే కాదు...అందులో ఎక్కించి తిప్పిన వికాస్‌కు ఆ గ్రామ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటాం అని చెబుతున్నారు.

మాట ఇచ్చాడు... పైలట్ అయ్యాడు.. విమానంలో తిప్పాడు

మాట ఇచ్చాడు... పైలట్ అయ్యాడు.. విమానంలో తిప్పాడు

ఇంతకీ విషయం ఏమిటంటే... వికాస్‌కు చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే ఆశ ఉండేది. పైలట్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. పైలట్ అయ్యాడు. ఇక తన ముందున్న లక్ష్యం తన ఊరిలో గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. తాను పైలట్ అయితే విమానంలో తిప్పుతానని ఆ ఊర్లోని అమ్మమ్మలకు తాతయ్యలకు మాట ఇచ్చాడు వికాస్. ఆ మాటకు కట్టుబడి 22 మంది వృద్ధులను విమానంలో పలు ప్రాంతాలకు తిప్పాడు. విమనాం చూడటమే గగనం అనుకున్న వృద్ధులు ఆ విమానంలో కూర్చుని అది ఒక్కసారి గాల్లోకి ఎగరగానే వారు ఆ వయస్సులో పొందిన ఆనందం అనుభూతి అంతా ఇంతా కాదు.

విమానం ఎక్కిన బామ్మ తాతయ్యల ముఖాల్లో ఏదో తెలియని ఆనందం

విమానం ఎక్కిన బామ్మ తాతయ్యల ముఖాల్లో ఏదో తెలియని ఆనందం

వృద్ధులను విమానంలో అమృత్‌సర్‌కు తీసుకెళ్లి అక్కడ స్వర్ణదేవాలయం చూపించాడు. అనంతరం జలియన్ వాలా బాగ్, వాఘా బోర్డర్, ఢిల్లీ చూపించాడు. ఇంకేముంది అమ్మమ్మలు తాతయ్యలు వికాస్‌పై దీవెనలు కురిపించారు. చాలామంది మాట ఇస్తుంటారు కానీ చాలా కొద్ది మందే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని బిమ్లా అనే 90 ఏళ్ల బామ్మ చెప్పింది. వికాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడంటూ ఆనందం వ్యక్తం చేసింది. తన కొడుకు ఇలా సొంత ఊర్లోని వృద్ధులను విమానంలో తిప్పి మాటమీద నిలబడటం చాలా ఆనందంగా ఉందని అన్నాడు వికాస్ తండ్రి మహేంద్ర. మహేంద్ర ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తన కొడుకు యువతకు ఆదర్శంగా నిలిచాడని పొంగిపోయాడు.

English summary
A man named Vikas Jayani after becoming a pilot returned to his village and arranged for the air travel from New Delhi to Amritsar for all the residents aged above 70. The elderly visited the Golden Temple, Wagah border and Jallianwala Bagh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X