వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాలో చాన్స్: ఢిలీకి చెక్కేసిన చెన్నై చిన్నది: 50 గంటలు రోమాన్స్, తండ్రికి ఫోన్ చేసి !

సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో రెండు రోజులకు పైగా ఎంజాయ్ చేశాడు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో రెండు రోజులకు పైగా ఎంజాయ్ చేశాడు. తరువాత యువతిని నిర్బంధించి నీ కూతురిని వదిలిపెట్టాలంటే రూ. ఐదు లక్షలు ఇవ్వాలని ఆమె తండ్రిని డిమాండ్ చేశాడు.

<strong>హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె !</strong>హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె !

ఫేస్ బుక్ లో పరిచయం అయిన తమిళనాడు యువతి మీద అత్యాచారం చేసిన ఢిల్లీకి చెందిన మహేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహేష్ నిర్బంధించిన యువతిని రక్షించి ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ఫేస్ బుక్ ఫ్రెండ్ !

ఫేస్ బుక్ ఫ్రెండ్ !

తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల యువతి, ఢిల్లీకి చెందిన మహేష్ ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఆమెతో ప్రతిరోజూ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నాడు. యువతికి సినిమాల్లో నటించాలని కోరిక ఉందని తెలుసుకున్నాడు.

నువ్వే హీరోయిన్

నువ్వే హీరోయిన్

తనకు బాలీవుడ్ కు చెందిన కొందరు దర్శకులు, నిర్మాతలు పరిచయం ఉన్నారని, నిన్ను సినిమాల్లో హీరోయిన్ చేస్తానని యువతిని నమ్మించాడు. నువ్వు ఢిల్లీ వస్తే దర్శకులు, నిర్మాతల దగ్గరకు పిలుచుకుని వెళ్లి పరిచయం చేస్తానని యువతికి చెప్పాడు.

ఢిల్లీ చెక్కేసిన యువతి

ఢిల్లీ చెక్కేసిన యువతి

మహేష్ మాయ మాటలు నమ్మిన యువతి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జూన్ 16వ తేదీ తమిళనాడు నుంచి ఢిల్లీ వెళ్లిపోయింది. తనను నమ్మి వచ్చిన యువతిని మహేష్ కులుసుకున్నాడు. దక్షిణ ఢిల్లీలోని ఓఇంటికి ఆమెను తీసుకెళ్లాడు.

రెండు రోజులు రోమాన్స్

రెండు రోజులు రోమాన్స్

యువతిని హీరోయిన్ చేస్తానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహేష్ ఓ ఇంటిలో ఆమెతో రోమాన్స్ చేశాడు. రెండు రోజుల పాటు యువతితో జల్సా చేసిన మహేష్ తరువాత తన అసలు స్వరూపం చూపించాడు. యువతిని నిర్బంధించి ఆమె మొబైల్ లాక్కొన్నాడు.

హల్ మీ కూతురు కావాలంటే !

హల్ మీ కూతురు కావాలంటే !

యువతి మొబైల్ నుంచి తమిళనాడులో ఉంటున్న ఆమె తండ్రికి ఫోన్ చేసిన మహేష్ మీ అమ్మాయిని ప్రాణాలతో వదిలిపెట్టాలంటే రూ. ఐదు లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు. రెండు మూడు సార్లు కుమార్తె మొబైల్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఆమె తండ్రి ఆందోళన చెందాడు.

మీరే కాపాడండి !

మీరే కాపాడండి !

తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని, మీరే కాపాడాలని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు పక్కా ప్లాన్ వేసి యువతి తండ్రితోనే మహేష్ కు ఫోన్ చేయించారు. మీరు అడిగిన రూ. ఐదు లక్షలు సిద్దంగా ఉందని, చెప్పించారు.

యువతి దగ్గర ముందే లాగేశాడు !

యువతి దగ్గర ముందే లాగేశాడు !

ఢిల్లీ వెళ్లిన పోలీసులు రూ. 5 లక్షలు తీసుకోవాలని మహేష్ కు సూచించారు. యువతి తండ్రి వచ్చాడని డబ్బు తీసుకోవడానికి వచ్చిన మహేష్ అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు మహేష్ ను అరెస్టు చేశారు. రెండు నెలల క్రితమే యువతిని నమ్మించి ఆమె అకౌంట్ నుంచి మహేష్ అకౌంట్ కు రెండు సార్లు రూ. 25 వేలు చొప్పున జమ చేయంచుకున్నాడని పోలీసులు తెలిపారు. మోసగాడు మహేష్ మీద అత్యాచారం, కిడ్నాప్, మోసం కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
The incident occurred in the national capital of Delhi, where a young man, who plays a love story with a familiar girl on Facebook, had betrayed her to marry her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X