వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిలాడీ....లేడీ, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అంటూ హంగామా: రాత్రి భర్త, బంధువుతో, చివరికి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎస్ఐ యూనిఫాం వేసుకుని దందాలు చేస్తున్న మహిళతో పాటు ఇద్దరు నిందితులను తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగింది. ఎస్ఐ యూనిఫాం వేసుకుని వాహనాలు నిలిపి నగదు లాక్కొంటున్న నకిలీ ఎస్ ఐ సూర్యప్రియ (27), రాజదురై, చక్రపాణి అనే ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఎక్కడెక్కడ ఎంత మందిని మోసం చేశారు అని ఆరా తీస్తున్నామని జాయింట్ పోలీసు కమిషనర్ కార్తిగేయన్ తెలిపారు.

టిప్పు సుల్తాన్ చరిత్ర: ఎంత క్రూరుడు అంటే, మైసూరు రాజులను వదల్లేదు, డీసీఎం !టిప్పు సుల్తాన్ చరిత్ర: ఎంత క్రూరుడు అంటే, మైసూరు రాజులను వదల్లేదు, డీసీఎం !

 మద్యం మత్తులో బైక్ !

మద్యం మత్తులో బైక్ !

కడలూరు జిల్లా చిదంబరం నగర పోలీస్ ఇన్స్ పెక్టర్ మురుగేషన్ నేతృత్వంలో రాత్రి గాంధీ విగ్రహం సర్కిల్ లో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో మందక్కరై నివాసి చక్రపాణి అనే వ్యక్తి పీకలదాక మద్యం సేవించి బైక్ లో అటువైపు వెళ్లాడు. మద్యం మత్తులో వాహనం నడిపిన చక్రపాణి బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దంపతులకు సమాచారం !

దంపతులకు సమాచారం !

పోలీసులు బైక్ లాక్కోవడంతో చక్రపాణి ఆందోళనకు గురైనాడు. తరువాత చక్రపాణి అతని బంధువులు రాజదురై, అతని భార్య సూర్యప్రియ (27)కు సమాచారం ఇచ్చాడు. ఎలాగైనా పోలీసుల దగ్గర ఉన్న తన బైక్ ను విడిపించాలని చక్రపాణి రాజదురై, సూర్యప్రియ దంపతులకు చెప్పాడు.

నా పవర్ చూపిస్తా !

నా పవర్ చూపిస్తా !

చక్రపాణికి ధైర్యం చెప్పిన సూర్యప్రియ తన సత్తా చూపిస్తానని, నీ బైక్ విడిపిస్తానని హామీ ఇచ్చింది. తరువాత ఎస్ఐ యూనిఫాం వేసుకున్న సూర్యప్రియా నేరుగా చిదంబరం పోలీస్ స్టేషప్ కు వెళ్లింది. తాను చెన్నై నగరంలోని నీలాంగరై పోలీస్ స్టేషన్ లో ఎస్ గా పని చేస్తున్నానని అక్కడ ఉన్న పోలీసులకు సూర్యప్రియ చెప్పింది.

మర్యాదగా బైక్ ఇవ్వండి

మర్యాదగా బైక్ ఇవ్వండి

చిదంబరం పోలీస్ స్టేషన్ లో హంగామా చేసిన సూర్యప్రియ చక్రపాణి దగ్గర స్వాధీనం చేసుకున్న బైక్ ఇచ్చేయాలని, కేసు నమోదు చెయ్యకూడదని అక్కడ ఉన్న పోలీసులకు చెప్పింది. పోలీసులకు సూర్యప్రియ తీరుపై అనుమానం వచ్చి వెంటనే జాయింట్ పోలీసు కమిషన్ కార్తిగేయన్ కు సమాచారం ఇచ్చారు.

 నకిలీ లేడీ ఎస్ఐ

నకిలీ లేడీ ఎస్ఐ

జాయింట్ పోలీసు కమిషనర్ కార్తిగేయన్ చెన్నైలోని నీలాంగరై పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి అక్కడ ఎస్ఐగా సూర్యప్రియ ఉద్యోగం చేస్తున్నారా అని ఆరా తీశారు. ఈ పోలీస్ స్టేషన్ లో ఎవ్వరూ లేడీ ఎస్ఐ లేరని నీలాంగరై పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సూర్యప్రియతో పాటు ఆమె భర్త రాజదురైని, చక్రపాణిని అదుపులోకి తీసుకున్నారు.

లేడీ కిలాడీ మాయలు

లేడీ కిలాడీ మాయలు

సూర్యప్రియ ప్రతినిత్యం ఎస్ఐ యూనీఫాం వేసుకుని భర్త రాజదురై, బంధువు చక్రపాణితో కలిసి పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి వారిని బెదిరించి నగదు వసూలు చేస్తున్నారని విచారణలో వెలుగు చూసిందని జాయింట్ పోలీసు కమిషనర్ కార్తిగేయన్ అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని అనేక మందిని మోసం చేశారని వెలుగు చూసిందని, వీరు ఎంత మందిని మోసం చేశారు ? అని ఆరా తీస్తున్నామని జాయింట్ పోలీసు కమిషనర్ కార్తిగేయన్ తెలిపారు.

English summary
Chennai: Young woman arrested for playing fake sub inspector (SI) role near Chidambaram in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X