వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై సబర్బన్ రైలు మరణ మృదంగమే: జారిపడి యువ ఉద్యోగిని చార్మీ మృతి

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న లోకల్ రైలు నుంచి పడి ఓ యువ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని చార్మీ ప్రసాద్‌(2)గా గుర్తించారు.

సార్! మా నాన్న జీతం పెంచండి: ముఖ్యమంత్రికి ఆరేళ్ల చిన్నారి లేఖ, ఇంకా ఏం రాసిందంటే?సార్! మా నాన్న జీతం పెంచండి: ముఖ్యమంత్రికి ఆరేళ్ల చిన్నారి లేఖ, ఇంకా ఏం రాసిందంటే?

రైలు నుంచి జారి పడ్డ చార్మీ

రైలు నుంచి జారి పడ్డ చార్మీ

వివరాల్లోకి వెళితే.. ముంబై నగరానికి చెందిన చార్మీ ప్రసాద్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. విధుల నిమిత్తం సోమవారం లోకల్ సబర్మన్ రైలు ఎక్కారు. ఈ క్రమంలో డోంబివలి, కోపార్ స్టేషన్ల మధ్యలో ఆక్మస్తాత్తుగా రైలు నుంచి జారి కిందపడిపోయారు.
రైలు పట్టాల పక్కన యువతి పడి ఉండటం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.

తీవ్రగాయాలపాలై..

తీవ్రగాయాలపాలై..

తీవ్రగాయాలపాలైన చార్జీ ప్రసాద్‌ను రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చార్మీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతురాలు చార్మీ ప్రసాద్ ఘట్కాపూర్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, చార్మీ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.

రోజుకు 8-10మంది ప్రాణాలు గాలిలో..

రోజుకు 8-10మంది ప్రాణాలు గాలిలో..

కాగా, ముంబై సబర్మన్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల్లో రోజు 8-10 మంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ సాంద్రతతో ఈ రైళ్లు నడస్తుండటం గమనార్హం. 2010-2019 మధ్య కాలంలో సబర్బన్ రైలు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 27,000గా ఉండటం గమనార్హం.

విపరీతమైన రద్దీతో...

విపరీతమైన రద్దీతో...


రైలు పట్టాలు దాటుతున్న సమయంలో, రైళ్లలో జారిపడుతున్న ఘటనల్లో వందలాది మంది వికలాంగులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి కోసం ముంబై నగరానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది వలస వస్తుండటంతో నగరంలో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. బస్సులు, రైళ్లు రోజూ కిక్కిరిసిపోతుంటాయి. రైళ్లలో రద్దీ విపరీతంగా ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. సెంట్రల్ రైల్వే ప్రతీరోజూ 1774 సర్వీసులను నడుపుతోంది. శనివారం నుంచి 42 రైళ్ల టైమ్ టేబుల్ మార్చింది. పలు రైళ్లను గమ్యస్థానాలను పొడిగించింది.

English summary
A 22-year-old woman on Monday fell from a suburban train between Dombivali and Kopar stations in Thane district and died after being rushed to a nearby hospital with severe injuries, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X