చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురి ఫ్రెండ్ తో వ్యాపారి అక్రమ సంబంధం, సెక్స్ వీడియోలతో బ్లాక్ మెయిల్, సింపుల్ గా చంపేసింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై: వివాహేత సంబంధం పెట్టుకున్న వ్యాపారి కూతురి స్నేహితురాలి చేతిలో హత్యకు గురైనాడు. కూతురి స్నేహితురాలికి ఖరీదైన బహుమాలు తీసిచ్చి ఆమెను వలలో వేసుకుని చాలా కాలం గుట్టుచప్పుడు కాకుండా ఎంజాయ్ చేశాడు. యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటంతో తట్టుకోలేని వ్యాపారి ఆమెతో ఏకాతంగా తీసుకున్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఇంత కాలం నీకు శారీర సుఖం ఇచ్చానని, తననే బ్లాక్ మెయిల్ చేస్తావా ? అంటూ సహనం కోల్పోయిన యువతి పక్కాప్లాన్ ప్రకారం నడిరోడ్డులో వ్యాపారిని సింపుల్ గా చంపేసింది. వ్యాపారిని హత్య చేసిన యువతిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. యువతిని ఉరి తీయాలని వ్యాపారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

కర్పూరం వ్యాపారి

కర్పూరం వ్యాపారి

తమిళనాడులోని తుత్తుకూడికి చెందిన అమ్మన్ శేఖర్ (54) కొన్నేళ్ల క్రితం చెన్నై వచ్చి కర్పూరం హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఉత్తర చెన్నైలోని భార్య, కుమార్తెతో కలిసి అమ్మన్ శేఖర్ అక్కడే స్థిరపడి వ్యాపారం చేస్తున్నాడు. కర్పూరం వ్యాపారంలో అమ్మన్ శేఖర్ బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు.

కూతురి ఫ్రెండ్ మీద కన్ను

కూతురి ఫ్రెండ్ మీద కన్ను

అమ్మన్ శేఖర్ కూతురుకు అందమైన స్నేహితురాలు పవిత్ర (25) ఉంది. పవిత్ర నిత్యం అమ్మన్ శేఖర్ కుమార్తెను కలవడానికి అతని ఇంటికి వెళ్లేది. అదే సమయంలో కూతురు స్నేహితురాలు పవిత్ర మీద అమ్మన్ శేఖర్ కు లైంగిక వాంఛ కలిగింది. ఎలాగైన పవిత్రను వలలో వేసుకోవాలని అమ్మన్ శేఖర్ నిర్ణయించాడు.

 ఖరీదైన బహుమానాలు

ఖరీదైన బహుమానాలు

కూతురు స్నేహితురాలు పవిత్రతో పరిచయం పెంచుకున్న అమ్మన్ శేఖర్ ఆమెకు ఖరీదైన బహుమతులు తీసిస్తూ సన్నిహితంగా మెలిగాడు. స్నేహితురాలి తండ్రి అమ్మన్ శేఖర్ తో పవిత్ర చాల క్లోజ్ అయ్యింది. అవరసరమైన సమయంలో లెక్కలేనంత డబ్బులు, ఖరీదైన బహుమతులు ఇస్తున్న అమ్మన్ శేఖర్ కు పవిత్ర చాల దగ్గర అయ్యింది.

కూతురు ఫ్రెండ్ తో అక్రమ సంబంధం

కూతురు ఫ్రెండ్ తో అక్రమ సంబంధం

కూతురు ఫ్రెండ్ పవిత్రతో అమ్మన్ శేఖర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లు తిరగడం మొదలు పెట్టారు. అమ్మన్ శేఖర్ తో పవిత్ర ఉల్లాసంగా గడపడం మొదలు పెట్టింది. ఎక్కడపడితే అక్కడ పవిత్ర, అమ్మన్ శేఖర్ కలుసుకుని శారీరకంగా ఎంజాయ్ చేశారు.

పవిత్రకు పెళ్లి సంబంధాలు

పవిత్రకు పెళ్లి సంబంధాలు

పవిత్రకు ఆమె తల్లిదండ్రలు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఆ విషయం పవిత్రతో అక్రమ సంబంధం సాగిస్తున్న అమ్మన్ శేఖర్ కు తెలిసింది. తనను కాదని నువ్వు వేరే వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు, నిన్ను నేను బాగా చూసుకుంటానని, పెళ్లి మాత్రం వదని అమ్మన్ శేఖర్ పవిత్రతో గొడవ పెట్టుకున్నాడు.

ఏకాంతం వీడియోలతో బ్లాక్ మెయిల్

ఏకాంతం వీడియోలతో బ్లాక్ మెయిల్

ఇంత కాలం నీకు శారీరక సుఖం ఇచ్చానని, నేను ఇంటిలో చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అమ్మన్ శేఖర్ కు పవిత్ర తేల్చి చెప్పింది. ఈ విషయంలో రెచ్చిపోయిన అమ్మన్ శేఖర్ పవిత్రతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో తీసుకున్న వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని చెబితే పెళ్లి చేసుకునే యువకుడికి ఈ వీడియోలు పంపిస్తానని పవిత్రనుహెచ్చరించాడు.

పక్కాప్లాన్ వేసిన పవిత్ర

పక్కాప్లాన్ వేసిన పవిత్ర

ఇంత కాలం నీకు పడక సుఖం ఇచ్చిన తననే బ్లాక్ మెయిల్ చేస్తావా అంటూ పవిత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాగైనా అమ్మన్ శేఖర్ ను హత్య చేసి అతని దగ్గర ఏకాంతంగా తీసుకున్న వీడియోలు స్వాధీనం చేసుకోవాలని పవిత్ర పక్కాప్లాన్ వేసింది. అమ్మన్ శేఖర్ ను హత్య చెయ్యాలని కొన్ని రోజుల నుంచి పవిత్ర వేచి చూసింది.

రాత్రి ఫోన్ చేసి ఎంజాయ్ చెయ్యాలని!

రాత్రి ఫోన్ చేసి ఎంజాయ్ చెయ్యాలని!

సోమవారం రాత్రి అమ్మన్ శేఖర్ కు ఫోన్ చేసిన పవిత్ర మనం ఏకాంతంగా గడపడానికి రావాలని చెప్పింది. తరువాత ఇద్దరూ చెన్నైలోని మెరీనా బీచ్, బెసెంట్ నగర్ తదితర ప్రాంతాల్లో తిరిగారు. అనంతరం కొత్తపేటలోని చాకలిపేట్ హార్బర్ క్వాటర్స్ మైదానం వైపు బైక్ లో వెళ్లారు. ఆ సమయంలో బైక్ నిలిపి తనకు ఓ బహుమానం తీసుకురావాలని పవిత్ర అమ్మన్ శేఖర్ కు చెప్పింది. బైక్ నిలిపి వెళ్లి ఓ బహుమానం తీసుకు వచ్చిన అమ్మన్ శేఖర్ పవిత్రకు ఇచ్చాడు.

 కళ్లు మూసుకో నీకు సినిమా చూపిస్తా!

కళ్లు మూసుకో నీకు సినిమా చూపిస్తా!

కొంత సేపు రాత్రి అక్కడే రాసలీలు సాగించిన పవిత్ర తరువాత నువ్వు కళ్లు మూసుకోవాలని, నీకు ఏదో ఒకటి చూపిస్తానని యువతి అమ్మన్ శేఖర్ కు చెప్పింది. ఆ సమయంలో కళ్లు మూసుకున్న శేఖర్ పై పవిత్ర మత్తు స్ప్రే చల్లింది. తరువాత ముందుగా వెంట తెచ్చుకున్న కత్తితో అక్కడే కుప్పకూలిన అమ్మన్ శేఖర్ మెడ, గొంతు మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి అక్కడి నుంచిపారిపోయింది. తీవ్రగాయాలైన అమ్మన్ శేఖర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అమ్మన్ శేఖర్ మొబైల్ డేటా ఆధారంగా పోలీసులు అక్రమ సంబంధం కారణంతో పవిత్ర హత్య చేసిందని గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. యువతిని వెంటనే ఉరి తీయాలని అమ్మన్ శేఖర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తనను శారీరకంగా హింసించడం వలనే అమ్మన్ శేఖర్ ను హత్య చేశానని పవిత్ర పోలీసులకు చెబుతోంది.

English summary
24 year old young woman killed her friends father due to sexual torture near chennai and she is under police custody now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X