చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య, ఇద్దరితో రాసలీలలు: లేడీ పోలీసుతో అక్రమ సంబంధం, ప్రియుడిపై పెట్రో దాడి చేసింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై: కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయితో ఓ పోలీసు వైభవంగా పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేశాడు. దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తరువాత వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న పోలీసు ఆమెను ఏకంగా ఇంటికి తీసుకు వచ్చి కాపురం పెట్టాడు. ఇంతతో ఆగకుండా పని చేస్తున్న చోట మరో మహిళా పోలీసుతో ఆ కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం చూసి సహించలేని ప్రియురాలు ప్రియుడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చెయ్యడానికి ప్రయత్నించింది. తమిళనాడులోని చెన్నైలోని తిరుముల లెవాయిల్ లో ఈ ఘటన చోటచేసుకుంది.

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

ఘనంగా పోలీసు పెళ్లి

ఘనంగా పోలీసు పెళ్లి

తమిళనాడులోని అవడి స్పెషల్ పోలీసు బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వెంకటేష్ (30) అనే యువకుడు సొంత ఊరు విల్లుపురం. 2012వ సంవత్సరంలో కానిస్టేబుల్ వెంకటేష్ ఘనంగా జయ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వెంకటేష్, జయ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేష్, భార్య జయ, కుమారుడు, కుమార్తెతో కలిసి సత్యమూర్తినగర్ లోని పోలీసు క్వాటర్స్ లో కాపురం ఉంటున్నాడు.

పిల్లల తల్లితో అక్రమ సంబంధం

పిల్లల తల్లితో అక్రమ సంబంధం

పులియూరు ప్రాంతానికి చెందిన ఆషా (32) అనే మహిళతో వెంకటేష్ కు పరిచయం అయ్యింది. వెంకటేష్, ఆషా స్నేహం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆషాకు అంతకు ముందే ధర్మలింగం అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఆషా, ధర్మలింగంకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంటిలో ప్రియురాలితో జల్సాలు

ఇంటిలో ప్రియురాలితో జల్సాలు

భార్య జయ, కుమారుడు, కుమార్తెను నిర్లక్షం చేసిన వెంకటేష్ ప్రియురాలు ఆషాతో కలిసి ఎంజాయ్ చేశాడు. భర్త వెంకటేష్ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భార్య జయ అతనితో గొడవ పెట్టుకుంది. నీకు దిక్కున్నచోట చెప్పుకో అని వెంకటేష్ ఎదురుతిరగడంతో జయ భర్త వెంకటేష్ ను వదిలి 2015లో కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తె మాత్రం వెంకటేష్ తో ఉండిపోయింది. ఇదే సమయంలో వెంకటేష్ ప్రియురాలు ఆషాను నేరుగా సత్యమూర్తినగర్ లోని పోలీసు క్వాటర్స్ లోని ఇంటికి తీసుకెళ్లి జల్సాలు చేస్తున్నాడు.

మహిళా పోలీసుతో లింక్

మహిళా పోలీసుతో లింక్

భార్య జయ, ప్రియురాలు ఆషాతో కాకుండా వెంకటేష్ మరో మహిళా పోలీసును పరిచయం చేసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జయ మాత్రం తన భర్త వెంకటేష్ చచ్చిపోయాడు అనుకుని వదిలేసింది. అయితే వెంకటేష్, మహిళా పోలీసు అక్రమ సంబంధం విషయం కాస్తా ప్రియురాలు ఆషాకు తెలిసింది.

పెట్రోల్ పోసి నిప్పంటించింది

పెట్రోల్ పోసి నిప్పంటించింది

నేను కాకుండా నీకు మరో మహిళా పోలీసు కావాలసి వచ్చిందా అంటూ ఆషా ప్రియుడు వెంకటేష్ తో గొడవ పెట్టుకుంది. రాత్రి మద్యం మత్తులో వెంకటేష్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వెంకటేష్, ఆషా మద్య మహిళా పోలీసు విషయంపై మాటామాటా పెరిగింది. నీకు ఎంజాయ్ చెయ్యడానికి ఇంకా ఎంత మంది అమ్మాయిలు కావాలి, నీ కామంతో మా జీవితాలు నాశనం అవుతున్నాయని రెచ్చిపోయిన ఆషా ఇంటిలో ఉన్న పెట్రోల్ తీసుకుని వెంకటేష్ మీద పోసింది. మద్యం మత్తు దిగడంతో వెంకటేష్ ఇంటిలో నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే వెంటనే ఆషా అగ్గిపుల్ల వెలిగించి వెంకటేష్ మీద వేయ్యడంతో అతనికి మంటు వ్యాపించాయి.

కామంతో కాలిపోయాడు

కామంతో కాలిపోయాడు

వెంకటేష్ కు తీవ్రగాయాలు కావడంతో అదే పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్న సాటి పోలీసులు వెంటనే అతన్ని కీల్పాక్కం ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ శరీరం చాలా కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. విషయం తెలుసుకున్న ఇన్ స్పెక్టర్ పురుషోత్తమన్ కేసు నమోదు చేసి ప్రియుడు వెంకటేష్ ను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ఆషాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. తన భర్త వెంకటేష్ ఎప్పుడో చచ్చిపోయాడని, అతన్ని చూడటానికి మాత్రం నేను రానని జయ సమాధానం ఇచ్చిందని పోలీసులు అంటున్నారు.

English summary
Young woman tries to kill policeman due to illegal relationship to chennai and lady arrested now near Chennai in Tamil Nadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X