వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26 ఏళ్లకే ఎంపీ : ఎస్టీ మహిళగా చంద్రానీ రికార్డు, ప్రత్యర్థిపై 66 వేల ఓట్లతో విజయం

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. మొత్తం 543 స్థానాలు కాగా .. వెల్లూరు ఎన్నికను ధనప్రవాహం వల్ల ఈసీ రద్దు చేసింది. 542 ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇందులో ఎంపీగా గెలిచి రికార్డు స‌ృష్టించారు 26 ఏళ్ల చంద్రానీ ముర్ము అనే ఇంజినీర్ పోస్ట్ గ్రాడ్యుయేట్.

చంద్రానీ వైపే మొగ్గు ..?
ఒడిశాలోని కియోన్‌ఝర్ లోక్ సభ స్థానం ఎస్టీకి రిజర్వ్ చేయబడింది. ఇక్కడి నుంచి విద్యావంతులైన ఎస్టీ సామాజికవర్గానికి చెందిన 26 ఏళ్ల చంద్రానీ అధికారి బిజు జనతాదళ్ నుంచి బరిలోకి దింపింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ హామీనిచ్చి .. ఏడుగురు మహిళలకు సీటు కేటాయించారు. వారిలో చంద్రానీ ఒకరు. తనపై నవీన్ పట్నాయక్ ఉంచిన విశ్వాసన్ని నిలబెట్టి ఘన విజయం సాధించారు.

Youngest MP in 17th Lok Sabha : Chandrani Murmu

పీజీ స్టూడెంట్
భువనేశ్వర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో చంద్రానీ 2017లో ఎంటెక్ పూర్తిచేశారు. కియోన్ పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ హరిహర్ సోరెన్ మనవరాలె చంద్రానీ. తాత కోరిక మేరకు బీజేడీలో చేరారు. పార్టీలో చేరిన ఆమెకు .. నవీన్ పట్నాయక్ సిట్టింగ్ ఎంపీ శకుంతల లాగురిని కాదని .. చంద్రానీకి టికెట్ కేటాయించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని చంద్రానీ నిలబెట్టారు. బీజేపీ అభ్యర్థి అనంత నాయక్‌ను మట్టికరించారు. 66 వేల 203 ఓట్లతో విజయం సాధించారు. చంద్రానీ 45 శాతం ఓట్లు పడగా .. నాయక్ 39 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు.

English summary
Let us learn about the wonders of the results of the general elections. The total cancellation of 543 seats was canceled due to cash flow. Election Commission announced results of 542 polls. The 26-year-old Chandrani Murmu, an engineer post graduate,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X