వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ పర్వదినాన కశ్మీర్‌లో అల్లర్లు...ఒకరు మృతి

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌ మరో సారి అట్టుడికింది. అనంతనాగ్ పట్టణంలో రంజాన్ పండగ సందర్భంగా ప్రార్థనలు ముగిశాక స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ ఘర్షణలో ఓ 20 ఏళ్ల కుర్రాడు మృతి చెందాడు. మరో 10 మందికి గాయాలయ్యాయి. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

పుల్వామాలో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందడంపై ఆందోళనకారులు అనంతనాగ్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అది కాస్త ఉద్రిక్తత పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు అలర్ట్ అయి గుంపును చెదరగొట్టేందుకు భాష్పవాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే షిరాజ్ అహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదిలా ఉంటే రంజాన్ సందర్భంగా పోలీసుల భద్రతా దళాలు కొన్ని రోజులుగా అని ఆపరేషన్స్‌కు విరామం ప్రకటించాయి.

Youngster killed after clashes broke during Eid prayers in Kashmir

మరోవైపు షోపియన్ ప్రాంతంలో కూడా కొందరు ఆందోళనకారులు భద్రతాదళాపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. శ్రీనగర్‌లోని మసీదులో ప్రార్థనల సమయంలో ఈ అల్లర్లు చోటుచేసుకున్నట్లు సమాచారం.

English summary
A twenty year old man was killed in Kashmir’s Anantnag town on Saturday when clashes broke out between police and civilians soon after Eid prayers.Around ten people were injured in clashes that broke out in Anantnag’s Janglat Mandi area. One of the injured, Sheeraz Ahmad of Brakpora, died of his injuries later, doctors said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X