వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ సూచనలు విలువైనవి..! పరిగణలోకి తీసుకుంటాం..! చంద్రబాబుకు నీతి ఆయోగ్ లేఖ.. !!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ తీవ్రత, పాజిటీవ్ కేసుల సంఖ్య ఆధారంగా జోన్లుగా విభజించి కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికి కేసులు రోజురోజుకూ ఎందుకు పెరుగుతున్నాయో ప్రభుత్వ వర్గాలకు అంతుచిక్కకుండా తయారయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కరోనా మహమ్మారిని తరిమేయడానికి తీసుకోవాల్సిన చర్యలను పొందుపరుస్తూ కేంద్రానికి లేఖ రాసారు. చంద్రబాబు లేఖకు వెంటనే స్పందించిన కేంద్రం ఆఘమేఘాల మీద ప్రత్యుత్తరం పంపించింది. ఏపిలో ప్రస్తుతం ఇదే పరిణామం పట్ల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Recommended Video

Niti Aayog VC Rajiv Kumar Meets CM YS Jagan || జగన్ ను కలిసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌
 కరోనా కట్టడికి చంద్రబాబు సూచనలు.. కేంద్రానికి లేఖ రాసిని మాజీ సీఎం..

కరోనా కట్టడికి చంద్రబాబు సూచనలు.. కేంద్రానికి లేఖ రాసిని మాజీ సీఎం..

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి, ఏపి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. ఏపి రాజకీయాల్లో ఈ లేఖ పై తీవ్ర స్ధాయిలో చర్చ జరగుతున్నట్టు తెలుస్తోంది. ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ కట్టడిలో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికి పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా వైరస్ కట్టడిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కరోనా కట్టడి, ప్రజల అప్రమత్తత, ఆంక్షల అమలు, ముందు జాగ్రత్తలు, టెస్టుల నిర్వహణ అనే కీలక అంశాల గురించి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

 పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఆందోళన కలిగిస్తోందన్న చంద్రబాబు..

పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఆందోళన కలిగిస్తోందన్న చంద్రబాబు..

కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలి..? లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయాలంటే ఏం చేయాలి? అంతిమంగా కరోనాను రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచి ఎలా పారదోలాలి? అన్న విషయాలను ప్రస్తావిస్తూ ఓ సుధీర్ఘ లేఖను చంద్రబాబు ప్రధానికి సవివరంగా లేఖలో వివరించారు. ఈ లేఖలో ఉన్న అంశాలను చూసిన ప్రదానమంత్రిత్వ కార్యాలయం సదరు లేఖను నీతి ఆయోగ్ కు పంపింది. ఈ లేఖను చూసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వేగంగా స్పందించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు రాసిన లేఖలోని కీలకాంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన రాజీవ్ కుమార్, చంద్రబాబు సూచించిన అంశాల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యుత్తరం రాసారు.

 బాబు లేఖను నీతి ఆయోగ్ కు పంపిన కేంద్రం.. బాబుకు ప్రత్యత్తరం పంపిన నీతి ఆయోగ్..

బాబు లేఖను నీతి ఆయోగ్ కు పంపిన కేంద్రం.. బాబుకు ప్రత్యత్తరం పంపిన నీతి ఆయోగ్..

అంతే కాకుండా చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించిన అంశాలు ఎంతో కీలమమైనవని కూడా రాజీవ్ కుమార్ ప్రస్తావించారు. కంటైన్ మెంట్ల జోన్ల గుర్తింపు, వాటిలో ఎలాంటి నిబంధనలను పాటించాలి? ఆయా చర్యల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? తదితర అంశాలను చంద్రబాబు ప్రస్తావించిన విషయాన్ని రాజీవ్ కుమార్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ ఫార్మేషన్ వ్యవస్థాపక చైర్మన్ హోదాలో, ఆ సంస్థ తరఫున ఏ మేర డేటాను సేకరించారో, ఆ డేటాను ఎలా విశ్లేషించారన్న విషయాలను ప్రస్తావించిన రాజీవ్ కుమార్, చంద్రబాబు రాపిన లేఖలోని అంశాలను ప్రశంసించారు.

 మీ సలహాలు బాగున్నాయి.. పరిగణలోకి తీసుకుంటామన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్..

మీ సలహాలు బాగున్నాయి.. పరిగణలోకి తీసుకుంటామన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్..

అంతేకాకుండా సదరు డేటాతో చంద్రబాబు సూచించిన పలు సలహాలు ఏ మేర సత్ఫలితాలనిస్తాయన్న విషయాన్ని కూడా రాజీవ్ కుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబు సూచనలు దేశం నుంచి కరోనాను పారదోలేందుకు ఏ మేర సహాయపడతాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే, త్వరలో ఆయా అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు వద్దకు నీతి ఆయోగ్ బృందాన్ని కూడా పంపుతున్నట్లుగా కూడా రాజీవ్ పేర్కొనడం గమనార్హం. మొత్తంగా కరోనా క్లిష్ట సమయంలో, అంతులేని విపత్తు సంభవించిన వేళ, చంద్రబాబు నాయుడు రాసిని లేఖ ఉపయుక్తంగా ఉందని రాజీవ్ కుమార్ రాసిని రిప్లై లో వివరించారు.

English summary
Niti Aayog vice chairman Rajiv Kumar also mentioned that Chandrababu's letter was very important. Identification of containment zones and what kind of regulations should be followed? What are the results? Rajiv Kumar specifically mentioned that Chandrababu had mentioned other aspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X