Bengaluru: యువకుడి దారుణ హత్య, ప్రత్యక్షసాక్షి, ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ?, ఉర్దూ మాట్లాడలేదని కత్తితో !
బెంగళూరు: రాత్రి ఇంట్లో ఉన్న యువకుడికి అతని స్నేహితులు ఫోన్ చేశారు. తన బర్త్ డే సందర్బంగా అందరూ బయట హోటల్ లో భోజనం చేద్దామని, నువ్వు కూడా రావలని అతనికి చెప్పారు. స్నేహితులతో కలిసి బయట బిరియానీ తినేసి వస్తానని ఆ యువకుడు తల్లికి చెప్పాడు. స్నేహితులతో వెలుతున్నాడని అతని తల్లి కూడా సరే అని చెప్పింది. బిరియాని తినడానికి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైనాడు. యువకుడిని నడిరోడ్డు మీద దారుణంగా పొడిచి చంపేస్తున్న సమయంలో సమీపంలోని సీసీటీవీ కెమోరాల్లో రికార్డు అయ్యింది, కన్నడ బాష మాట్లాడాడని, ఉర్దూ మాట్లాడలేదని యువకుడిని చంపేశారని ఇప్పటికే అతని బంధువులు ఆరోపించారు. హత్యకు గురైన యువకుడు స్నేహితుడు, ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు ఆ రోజు ఏమి జరిగింది అంటూ పిన్ టూ పిన్ పోలీసులకు చెప్పాడు.

బెంగళూరు యువకుడు
బెంగళూరులోని జగజ్జీవన్ రామ్ నగర్ లో చంద్రశేఖర్ అలియాస్ చంద్రూ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఐటీఐ పూర్తి చేసిన చంద్రూ రైల్వే శాఖలో అప్రెంటిస్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉద్యోగానికి వెలుతున్న యువకుడు ఖాళీ సమయంలో అతని స్నేహితులతో కలిసి తిరుగుతున్నాడు.

ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లిన యువకుడు
ఈ రోజు తన బర్త్ డే అని, ఫ్రెండ్స్ అందరూ బయట హోటల్ లో బిరియానీ, చికెన్ కబాబ్ తిందామని, నువ్వు కూడా రావలని సైమన్ అతని స్నేహితుడు చంద్రూకు చెప్పాడు. స్నేహితులతో కలిసి బయట బిరియానీ తినేసి వస్తానని చంద్రూ తల్లికి చెప్పాడు. స్నేహితులతో వెలుతున్నాడని చంద్రూ బయటకు వెళ్లడానికి అతని తల్లి కూడా సరే అని చెప్పింది.

యువకుడి దారుణ హత్య
బిరియాని తినడానికి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన చంద్రూ అర్దరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో హళే గుడ్డదహళ్లి ప్రాంతంలో దారుణ హత్యకు గురైనాడు. చంద్రూను అతని స్నేహితుడి ముందే నడిరోడ్డులో దారుణంగా పొడిచి చంపేస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమోరాల్లో రికార్డు అయ్యింది,

పిన్ టూ పిన్ చెప్పిన ఫ్రెండ్
భోజనం చెయ్యడానికి వెలుతున్న సమయంలో చంద్రూ నడుపుతున్న బైక్ మరో యువకుడి బైక్ కు టచ్ అవ్వడం వలనే గొడవ మొదలైయ్యిందని, తరువాత కన్నడ, ఉర్దు బాషల విషయంలో గొడవ పెద్దది అయ్యిందని హత్యకు గురైన చంద్రూ స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు రాత్రి కొందరు చంద్రూను బలవంతంగా పట్టుకుని మనం కుర్చుని మాట్లాడుకుందామని చెప్పారని సైమన్ రాజ్ పోలీసులకు చెప్పాడు.

ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే ?
ఆ సమయంలో మేము కన్నడలో మాట్లాడితే నువ్వు మర్యాదగా ఉర్దూలో మాట్లాడు, మాకు కన్నడ రాదని చెప్పారని ఆ రోజు చంద్రూ పక్కనే ఉన్న సైమన్ రాజ్ పోలీసులకు చెప్పాడు. నేను ఇక్కడే పుట్టానని, నేను కన్నడ మాట్లాడుతానని చంద్రూ చెప్పాడని, ఉర్దూ ఎందుకు మాట్లాడవు అంటూ అతన్ని పొడిచి చంపేశారని ప్రత్యక్షసాక్షి సైమన్ రాజ్ జేజే నగర్ పోలీసులకు చెప్పాడు. కన్నడ-ఉర్దూ బాష విషయంలోనే చంద్రూ హత్యకు గురైనాడని వెలుగు చూడటంతో చంద్రూ హత్యను మరో కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.