విషాదం: అమ్మ చనిపోతోందని కొడుకు సూసైడ్, 2 గంటల సెల్పీ వీడియో
బెంగుళూరు: కన్నతల్లి మరణిస్తోందనే విషయం తెలుసుకొన్న కొడుకు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొడుకు ఆత్మహత్య చేసుకొన్న కొద్దిసేపటికే తల్లి కూడ మరణించింది.తల్లి లేకుండా తాను బతకలేనంటూ ఆ కొడుకు సుమారు రెండున్నర గంటల పాటు సెల్పీ వీడియోను రికార్డ్ చేసి తన స్నేహితులకు పంపాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో చోటు చేసుకొంది. అయితే కొడుకు మరణించిన విషయం తెలియకుండానే ఆ తల్లి కూడ మృతిచెందింది.
తల్లి దండ్రులను కనీసం పట్టించుకోలేని ఈ పరిస్థితుల్లో కన్నతల్లి చనిపోతోందనే విషయాన్ని తెలుసుకొన్న ఓ కొడుకు ఆత్మహత్య చేసుకొన్న ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
తండ్రి లేక పోవడంతో తనను అల్లారుమద్దుగా పెంచిన తల్లి క్యాన్సర్ వ్యాధికి గురై మృత్యువుకు చేరువైన విషయాన్ని తెలుసుకొన్న కొడుకు ఆమె మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయాడు.

తల్లి చనిపోతోందని తెలిసి కొడుకు ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు తాలూకాలోని వాజమంగళ గ్రామానికి చెందిన 29 ఏళ్ళ సతీష్ తన తల్లి రత్నమ్మ క్యాన్సర్ వ్యాధితో చనిపోతోందని తెలిసి ఆమె కంటే ముందే ఉరేసుకొని చనిపోయాడు. క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం ఆమె ఆసుపత్రిలో చేర్చారు.అయితే క్యాన్సర్ వ్యాధి తీవ్రమైంది. వ్యాధి నయం కాదని వైద్యులు తేల్చి చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళాలని సూచించారు. దీంతో ఇంటికి వెళ్ళిన మంగళవారం తెల్లవారుజామున సతీష్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

సతీష్‌ను అల్లారుముద్దుగా పెంచిన తల్లి
కొన్నేళ్ళ క్రితమే సతీష్ తండ్రి మరణించాడు. అయితే తండ్రి లేని లోటు తెలియకుండానే సతీష్ తల్లి రత్నమ్మ పెంచింది. సతీష్‌కు తల్లి అంటే అంతే ప్రేమ. అయితే క్యాన్సర్ వ్యాధి బారిన సతీష్ తల్లి రత్నమ్మ పడింది.దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు సతీష్. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమెకు నయమౌతోందని భావించాడు. కానీ, ఆమెకు నయం కాలేదు. ఆమె వ్యాధి నయం కాదని కూడ వైద్యులు తేల్చి చెప్పారు. ఈ కారణంగానే తల్లి లేకుండా తాను బతకలేనని సతీష్ భావించాడు..దీంతో ఆత్మహత్య చేసుకొన్నాడు.

రెండున్నర గంటల పాటు సెల్పీ వీడియో రికార్డింగ్
తల్లి రత్నమ్మ క్యాన్సర్ వ్యాధితో చనిపోతోందని వైద్యులు ప్రకటించడంతో సతీష్‌కు ఏం చేయాలో తోచలేదు. దీంతో రత్నమ్మ విషయాన్ని తెలుసుకొన్న సతీష్ వెంటనే ఇంటికి వచ్చేశాడు. రెండు గంటల పాటు సెల్పీ వీడియో రికార్డు చేశారు. తన భాదను ఆ సెల్పీ వీడియోలో వ్యక్తం చేశాడు. తల్లి లేకుండా తాను బతకలేనని ఆ సెల్పీ వీడియోలో సతీష్ ప్రస్తావించాడు. ఆ తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.సతీష్ ఆత్మహత్య చేసుకొన్న కొద్దిసేపటికే తల్లి కూడ మృతిచెందింది.

స్నేహితులను క్షమాపణలు కోరిన సతీష్
సెల్పీ వీడియోలో తన స్నేహితులను క్షమాపణలు కోరాడు సతీష్.తన ఆత్మహత్య కు ఎవరు కారణం కాదని ఆయన ప్రకటించారు.నా స్నేహితులందరికి నా చివరి నమస్కారాలు. మా అమ్మను వదిలి ఉండలేను అందుకే నే ను ఆత్మహత్య చేసుకుంటున్నానుని సతీష్ చెప్పారు. ఆత్మహత్య చేసుకో వడం ద్వారా నా స్నేహితులందరికీ మోసం చేస్తున్నానని సతీష్ ఆవేదనను వ్యక్తం చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications