• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గదిలో వివస్త్రగా.. రక్తపు మడుగులో ఆమె... ప్రాణం తీసిన టిక్‌టాక్ వివాదం...!!

|

టిక్‌టాక్ వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. మరో యువకుడితో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుందన్న అక్కసుతో ఆమె బాయ్ ఫ్రెండే హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మృతురాలిని వివాహితగా గుర్తించారు. భార్యాభర్తలం అని అబద్దం చెప్పి వీరిద్దరు ఓ లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నారు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించాక హత్య జరిగినట్టు సమాచారం. హత్య తర్వాత గదికి తాళం వేసి అతను వెళ్లిపోగా.. సిబ్బందికి అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడటంతో ఈ దారుణం బయటపడింది.

అందంగా ముస్తాబై టిక్‌టాక్.. కాసేపటికే ఫ్యాన్‌కు వేలాడుతూ.. అసలేం జరిగినట్టు..?

టిక్‌టాక్... ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు నచ్చలేదు..

టిక్‌టాక్... ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు నచ్చలేదు..

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన జ్యోతి(35) టిక్‌టాక్‌లో రెగ్యులర్‌గా వీడియోలు చేస్తుంటుంది. వివాహితురాలైన జ్యోతికి తమ బంధువైన ఓ అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో జ్యోతి మరో యువకుడితో అప్పుడప్పుడు టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తుండేది. ఆ విషయం ఆమె అనిల్‌కు నచ్చలేదు. అతనితో వీడియోలు చేయవద్దని పలుమార్లు హెచ్చరించాడు.

17సార్లు విచక్షణారహితంగా పొడిచి..

17సార్లు విచక్షణారహితంగా పొడిచి..

జ్యోతి మాత్రం సరదాగా టిక్‌టాక్‌లో అతనితో వీడియోలు చేసేది. దీంతో అనిల్ ఫ్రెండ్ లోలోపల ఆవేశంతో రగిలిపోయాడు. ఇదే క్రమంలో ఇటీవల మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణంలో ఉన్న ఓ లాడ్జిలో రూమ్ బుక్ చేసి ఆమెను రప్పించాడు. లాడ్జి సిబ్బందికి భార్యాభర్తలం అని చెప్పాడు. గదిలో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య టిక్‌టాక్ వీడియోల గురించి వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. వెంట తెచ్చుకున్న కత్తితో 17 సార్లు ఆమెను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు.

గదిలో వివస్త్రగా రక్తపు మడుగులో..

గదిలో వివస్త్రగా రక్తపు మడుగులో..

హత్యానంతరం మృతదేహాన్ని గదిలోనే వదిలేసి... తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. ఆరోజు రాత్రి కావొస్తున్నా.. గదిలో ఎలాంటి అలికిడి లేకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. అనిల్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. వెంటనే డూప్లికేట్ కీతో గది తలుపును తెరిచి చూశారు. బెడ్ పక్కన జ్యోతి వివస్త్రగా రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

    #Watch : David Warner, His Wife Dance For Mahesh Babu’s ‘Mind Block’ Song
    నేరం అంగీకరించిన అనిల్...

    నేరం అంగీకరించిన అనిల్...

    ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మైసూరులో అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించాడు. తమ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని... మరో యువకుడితో టిక్‌టాక్ వీడియోలు చేస్తుందన్న అక్కసుతోనే హత్యకు పాల్పడ్డానని చెప్పాడు. అతని సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ డేటా ఆధారంగా మరిన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

    English summary
    A youth held by Karnataka police for allegedly murdering his girlfriend in a lodge in Srirangapattanam,Mandya district. He said she did TIKTOK videos with some other guy and warned her to avoid him.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more