వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్ టాక్ పిచ్చి ఫ్రెండ్ ప్రాణం తీసింది!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ గురించి తెలియని యూత్ లేరు. ఈ యాప్ కారణంగా పాపులారిటీ కోసం పాకులాడుతూ యువత చెడిపోతోందని అందుకే దాన్ని బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. టిక్ టాక్‌ను నిషేధించే విషయాన్ని పరిశీలించాలని కోర్టులు సైతం కేంద్రానికి సూచించాయి. అలాంటి టిక్ టాక్ కారణంగా తాజాగా ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఫ్రెండ్స్‌తో కలిసి టిక్ టాక్ వీడియో తీస్తుండగా పిస్టోల్ పేలడంతో ప్రాణాలు విడిచాడు.

<strong>నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులు</strong>నడకపై అధ్యయనానికి రూ.16.44 కోట్ల నిధులు

వీడియో తీస్తుండగా పేలిన పిస్టోల్

వీడియో తీస్తుండగా పేలిన పిస్టోల్

ఢిల్లీకి చెందిన సల్మాన్ సోహైల్, ఆమిర్‌లు స్నేహితులు. ఆదివారం రాత్రి ఇండియా గేట్ వరకు కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోహెల్, సల్మాన్ కారు ముందు సీట్లలో కూర్చోగా ఆమిర్ వెనక సీట్‌లో కూర్చున్నాడు. సెంట్రల్ ఢిల్లీలోని రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే కారు డ్రైవ్ చేస్తున్న సోహైల్ టిక్ టాక్ వీడియో తీస్తానంటూ తన వద్ద ఉన్న నాటు తుపాకీ తీసి సల్మాన్‌కు గురి పెట్టాడు. ఇంతలో కారు కుదుపునకు లోను కావడంతో ప్రమాదవశాత్తూ చేతిలోని పిస్టోల్ పేలిపోయింది. దీంతో బుల్లెట్ సల్మాన్ చెంప భాగంలోకి దూసుకెళ్లింది.

బంధువుల ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని

బంధువుల ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని

పిస్టల్ బుల్లెట్ సల్మాన్ చెంపలోకి దూసుకుపోవడంతో సోహైల్, ఆమిర్‌లు తొలుత భయపడ్డారు. ఆ తర్వాత ధర్యాగంజ్‌లోని బంధువుల ఇంటికెళ్లి రక్తం అంటిన దుస్తులు మార్చుకున్నారు. బంధువు సాయంతో సల్మాన్‌ను దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ప్రాణాలు కోల్పోయిన సల్మాన్

ప్రాణాలు కోల్పోయిన సల్మాన్

అపస్మారక స్థితిలో ఉన్న సల్మాన్ హాస్పిటల్‌కు చేరుకునే సమయానికి చనిపోయాడు. అతన్ని పరిశీలించిన డాక్టర్లు మరణించినట్లు ధృవీకరించారు. హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు తుపాకీ పేల్చినందుకు సోహైల్‌ను అతన్ని రక్షించే ప్రయత్నం చేసినందుకుగానూ ఆమిర్‌తో పాటు సోహైల్ బంధువును అరెస్టు చేశారు.

సల్మాన్ మృతిపై అనుమానాలు

సల్మాన్ మృతిపై అనుమానాలు

టిక్ టాక్ వీడియో చేస్తుండగా పిస్టల్ పేలిందని స్నేహితులు చెబుతున్నప్పటికీ సల్మాన్ మృతిపై అతని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులు సైతం ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 19-year-old man was allegedly shot dead by his friend in Delhi as they posed with a pistol to make a video on mobile app TikTok, police said Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X