వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

youtube plan: ప్లాన్ A నాటుకోడి, B ఐస్ క్రీమ్, ఒంటరి జీవితం, ఆస్తి కోసం ఫ్యామిలీ మొత్తానికి స్కెచ్!

|
Google Oneindia TeluguNews

కొచ్చి / కోజికోడ్/ కాసరగూడు: పనిపాట లేకుండా వయసు వచ్చినా నిత్యం ఓ స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని వీడియో గేమ్ లు ఆడుకుంటూ, అశ్లీల వీడియోలు చూస్తున్న యువకుడిపై అతని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. నిత్యం తనను కుటుంబ సభ్యులు తిడుతున్నారని, వారి పీడవిరగడైతే ఒంటరిగా హ్యాపీగా జీవించడానికి మంచి చాన్స్ వస్తుందని, ఆస్తి మొత్తం నాకే వస్తుందని ఆ యువకుడు ఆలోచించాడు.

ప్లాన్ A ప్రకారం చికెన్ లో విషం కిలిపి పెట్టడంతో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. ప్లాన్ B తో ఐస్ క్రీమ్ లో విషం కలిపి కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. చెల్లెలి ప్రాణాలు పోయి తండ్రి కోమాలోకి వెళ్లిపోవడంతో ఆ క్రిమినల్ వ్యహారం మొత్తం బయటపడింది.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

హ్యాపీ ఫ్యామిలీలో ఐదు మంది

హ్యాపీ ఫ్యామిలీలో ఐదు మంది

కర్ణాటక- కేరళ రాష్ట్రం సరిహద్దులోని కాసరగూడు (కేరళ) జిల్లాలోని వెల్లరిక్కుందు ప్రాంతంలో పెన్నీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పెన్నీకి భార్య, కుమార్తెలు అన్నీ మేరి (16), మరో మైనర్ అమ్మాయి, కుమారుడు అల్బీన్ (21 ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పెన్నీ సంతోషంగానే ఉంటున్నాడు.

కొడుకు అల్బీన్ కు మొబైల్ పిచ్చి

కొడుకు అల్బీన్ కు మొబైల్ పిచ్చి

పెన్నీ కొడుకు అల్బీన్ కు 21 ఏళ్లు దాటిపోయినా తండ్రికి ఎలాంటి పనుల్లో సహాయం చెయ్యకుండా నిత్యం చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ పట్టుకుని కాలం గడిపేవాడు. ప్రతినిత్యం మొబైల్ ఫోన్ లో వీడియో గేమ్ లు ఆడటం, అశ్లీల వీడియోలు చూడటం అల్బీన్ కు అలవాటైయ్యింది. ఏదో ఒకపని చేస్తూ కుటుంబ సభ్యులకు సహాయం చెయ్యాలని, ఎప్పుడు మొబైల్ తో టైమ్ పాస్ చేసుకుంటే ఎలా అంటూ అల్బీన్ ను అతని తల్లిదండ్రులు మందలిస్తూ వచ్చారు.

యూట్యాబ్ లో చూసి హత్యలకు కుట్ర

యూట్యాబ్ లో చూసి హత్యలకు కుట్ర

నిత్యం తనను ఏదో ఒకటి సొట్టు పెట్టుకుని మందలిస్తున్న తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చెల్లెళ్లను చంపేస్తే తాను ఒంటరిగా జీవించ వచ్చని, ఆస్తి మొత్తం తన సొంతం అవుతోందని అల్బీన్ ఆలోచించాడు. పోలీసు కేసులు కాకుండా కుటుంబ సభ్యులను ఎలా చంపాలి అంటూ అల్బీన్ కొంత కాలం నుంచి యూట్యాబ్ లో హత్యలు ఎలా చెయ్యాలి ? అంటూ వివరాలు తెలుసుకుంటున్నాడు.

ప్లాన్ A నాటుకోడి, ప్లాన్ B ఐస్ క్రీంలో విషం

ప్లాన్ A నాటుకోడి, ప్లాన్ B ఐస్ క్రీంలో విషం

వారం రోజుల క్రితం యూట్యూబ్ లో చూపించినట్లు ప్లాన్ A నాటు కోడి మాంసంలో విషం కలిపిన అల్బీన్ కుటుంబ సభ్యులు అందరూ తినేలా స్కెచ్ వేశాడు. అయితే నాటు కోడి పులుసులో విషయం తక్కువ మోతాదులో కలపడం వలన కుటుంబ సభ్యులకు వాంతులు అయ్యి ప్రాణాలతో బయటపడ్డారు. ప్లాన్ B ప్రకారం ఐస్ క్రీమ్ లో విషం కలపాలని స్కెచ్ వేశారు.

కరోనా వచ్చిందని అనుమానం

కరోనా వచ్చిందని అనుమానం

ఈనెల 3వ తేదీన ఐస్ క్రీమ్ తయారు చేసిన అల్బీన్ రెండు కప్పుల్లో వేసి అందులో ఎలుకల మందు ఎక్కువగా కలిపి ఫ్రిజ్ లో పెట్టాడు. తరువాత ఎలుకల మందు కలపని ఐస్ తినిన అల్బీన్ విషం కలిపిన ఐస్ క్రీమ్ కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఐస్ క్రీమ్ బాగా లేదని అల్బీన్ తల్లి తినలేదు. అయితే ఐస్ క్రీమ్ బాగుందని అల్బీన్ చెల్లెలు పెన్నీ మేరి (16), ఆమె తండ్రి పెన్నీ తినేశారు. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన పెన్నీ, ఆయన కుమార్తె మేరీ పెన్నీని ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఇద్దరిని కోజికోడ్ ఆసుపత్రికి తరలించారు.

ఐస్ క్రీమ్ లో విషం ఉంది

ఐస్ క్రీమ్ లో విషం ఉంది

ఈనెల 6వ తేదీన పెన్నీ మేరీ చికిత్స విఫలమై మరణించింది. యువతి తండ్రి పెన్నీ ఐసీయూలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఐస్ క్రీమ్ లో విషం కలపడం వలనే పెన్నీ మేరీ ప్రాణాలు పోయాయని వైద్యులు పోస్టుమార్టుం నివేదిక ఇచ్చారు. అదే సమయంలో అల్బీన్ అనుమానాస్పదంగా ప్రవర్తించాడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

ఆస్తి కోసం ఎంతపని చేశాడు

ఆస్తి కోసం ఎంతపని చేశాడు

తాను ఒంటరిగా జీవించాలని, ఆస్తీ మొత్తం తానే అనుభవించాలని ఉద్దేశంతో ఐస్ క్రీమ్ లో తానే విషం కలిపానని, ఇందులో తన తల్లి ప్రమేయం లేదని అల్బీన్ అంగీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మీద ఒంటరి జీవితం గడపడానికి యూట్యాబ్ లో చూపి కుటుంబం మొత్తాన్ని అంతం చెయ్యాలని అల్బీన్ ప్రయత్నించాడని వెలుగు చూడటంతో కేరళలో కలకలం రేపింది.

English summary
youtube murder plan: Kerala man murders sister by mixing rat poison in ice cream, tries to kill whole family to usurp property
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X