వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వాస పరీక్షల్లో ఓడి ఐదుగురు ప్రధానుల రాజీనామాలు, 26 దఫాలు అవిశ్వాసాలు, ఇంధిరాయే టాప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వంపై టిడిపి, వైసీపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. సోమవారం నాడు పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉందా లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అవిశ్వాసానికి ఈ రెండు పార్టీలు మద్దతును కూడగడుతున్నాయి. అయితే కేంద్రంపై ఇప్పటికే 26 మార్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరో వైపు విశ్వాస తీర్మానాల్లో ఓటమి పాలై ఐదుగురు ప్రధానమంత్రులు తమ పదవులను వదులుకొన్నారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా , విభజన చట్టాన్ని అమలు చేయాలని టిడిపి, వైసీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై కేంద్రంపై ఈ రెండు పార్టీలు అవిశ్వాస నోటీసులను ఇచ్చాయి శుక్రవారం నాడు ఈ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసులు చర్చకు రాలేదు.

మరోసారి ఈ రెండు పార్టీలు కేంద్రంపై అవిశ్వాస నోటీసులను ఇచ్చాయి. మార్చి 19న కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై చర్చ జరిగే అవకాశం ఉందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి.ఈ మేరకు ఈ రెండు పార్టీలు పార్లమెంట్‌లో పలు పార్టీల మద్దతును కూడగడుతున్నాయి.

విశ్వాసాన్ని కోల్పోయిన పలు ప్రభుత్వాలు

విశ్వాసాన్ని కోల్పోయిన పలు ప్రభుత్వాలు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన పలు ప్రభుత్వాలు విశ్వాసాన్ని కోల్పోయిన ఘటనలు కూడ దేశంలో ఉన్నాయి. వాజ్‌పేయ్, విపిసింగ్, హెచ్‌డి దేవేగౌడ ప్రభుత్వాలు కూడ సభ్యుల విశ్వాసాన్ని చూరగొనలేక కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే మరికొన్ని సందర్భాల్లో కూడ పలు ప్రభుత్వాలు విశ్వాస తీర్మానాన్ని ఓడించి గట్టెక్కిన సందర్భాలు కూడ ఉన్నాయి.

అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటీ

అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటీ

కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి రాజ్యాంగంలోని 118వ, అధికరణ అనుమతి ఇచ్చింది. లోక్‌సభలో 198 నిబంధన కింద అవిశ్వాస తీర్మానం నోటీసును ఇవ్వొచ్చు. అవిశ్వాస తీర్మానానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. మొత్తంగా లోక్‌సభలో సభ్యుల సంఖ్యలో కనీసం 10 శాతం మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతిస్తే ఈ విషయమై చర్చను చేపట్టనున్నారు . మరోవైపు ప్రభుత్వం కూడ పార్లమెంట్‌లో తమ ప్రభుత్వానికి అనుకూలంగా విశ్వాస తీర్మానాలకు కూడ ప్రవేశపెట్టవచ్చు. అయితే విశ్వాస తీర్మానంలో ప్రభుత్వం లేదా ఆయా పార్టీలు పార్లమెంట్‌లో విశ్వాసాన్ని చూరగొంటే ప్రభుత్వాలు మనుగడ సాధిస్తాయి. 1979 లో చరణ్ సింగ్, 1996 లో వాజ్‌పేయ్ ప్రభుత్వాలు కుప్పకూలాయి.

అయిదుగురు ప్రధానుల రాజీనామాలు

అయిదుగురు ప్రధానుల రాజీనామాలు

దేశంలో ఇప్పటివరకు సుమారు 13 విశ్వాస తీర్మానాలపై చర్చ జరిగింది. విశ్వాస తీర్మానాల్లో ఓటమిపాలు కావడంతో అయిదుగురు ప్రధాన మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. వాజ్‌పేయ్ విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొని రెండు సార్లు రాజీనామాలు చేయాల్సి వచ్చింది .1989లో జనతాదళ్ నేత వీపీసింగ్ ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. అయితే 1989లో వీపీసింగ్ విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. అద్వానీ రథయాత్రను ఆనాటి విపీసింగ్ ప్రభుత్వం నిలువరించింది. దీంతో బిజెపి వీపీసింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొంది. జనతాదళ్‌లోని చంద్రశేఖర్ వర్గం కూడ బిజెపితో చేతులు కలిపింది. దీంతో వీపీసింగ్ ప్రభుత్వం కూలిపోయింది. 1997లో దేవేగౌడ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ దేవేగౌడ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొంది.1999లో వాజ్‌పేయ్ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షలో ఓటమి పాలైంది. ఒక్క ఓటుతోనే వాజ్‌పేయ్ ప్రభుత్వం కూలిపోయింది.

విశ్వాస తీర్మానాల్లో నెగ్గిన ప్రధానులు

విశ్వాస తీర్మానాల్లో నెగ్గిన ప్రధానులు


1990లో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్‌, 1991 1993లో పీవీనరసింహారావు విశ్వాస తీర్మానాలను ప్రతిపాదించి విజయం సాధించారు. పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్న ఘనత పీవి నరసింహరావుదే .1996లో దేవేగౌడ, 1997లో ఐకే గుజ్రాల్‌, 1998లో వాజ్‌పేయి, 2008లో మన్మోహన్‌సింగ్‌లు విశ్వాస తీర్మానాలు ప్రతిపాదించి విశ్వాస తీర్మానాల్లో విజయం సాధించారు.

కేంద్రంపై 26 అవిశ్వాస తీర్మానాలు

కేంద్రంపై 26 అవిశ్వాస తీర్మానాలు

1952 నుండి ఇప్పటవరకు లోక్‌సభలో 26వ దఫాలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించినట్టు రికార్డులు చెబుతున్నాయి. 1963 ఆగష్టులో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రుకు వ్యతిరేకంగా జెబి కృపలానీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. భారత్- చైనా యుద్దంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ తీర్మానం ఓటమి పాలైంది ఇంధిరాగాంధీ ప్రభుత్వంపై 15 దఫాలు అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించారు. అయితే అన్నింట్లో కూడ ఆమె విజయం సాధించారు.

English summary
YSR Congress and Telugu Desam Party (TDP) will push for acceptance of their notices for no-confidence motion against the Narendra Modi government when Lok Sabha meets on Monday amid no signs of a let-up in the Parliament deadlock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X