వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామకు భద్రత తొలగించండి, కించపరిచేలా కామెంట్స్, ఓం బిర్లాకు సురేశ్ వినతి

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మండిపడ్డారు. ఇటీవల రఘురామ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అతనికి కల్పించిన సెక్యూరిటీని తొలగించాలని సురేశ్ కోరారు. ఈ మేరకు ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతిపత్రం సమర్పించారు. తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి దాడి చేయిస్తానని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

వై క్యాటగిరీ భద్రత..

వై క్యాటగిరీ భద్రత..

రఘురామ కృష్ణరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. దీంతో దిష్టిబొమ్మలు దగ్దం చేయడంతో.. ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. తనకు భద్రత కల్పించాలని స్పీకర్‌ను కోరగా.. ఆయన హోంశాఖకు ఫార్వార్డ్ చేశారు. చివరికీ వై క్యాటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రఘురామ ఢిల్లీ వదలి వెళ్లేదు. కానీ ఇటీవల తన భద్రతా సిబ్బందితో కలిసి దాడి చేయిస్తానని చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి.సెక్యూరిటీని అడ్డంపెట్టుకుని ఎస్సీలను బెదిరిస్తున్నారని నందిగం సురేశ్ ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని స్పీకర్ కు తెలిపారు.

కించపరిచేలా కామెంట్స్..

కించపరిచేలా కామెంట్స్..

కులం పేరుతో కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని స్పీకర్ ఓం బిర్లాకు నందిగం సురేశ్ విన్నవించారు. రఘురామపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కల్పించిన భద్రతను దుర్వినియోగం చేస్తున్నారని కూడా ప్రస్తావించారు. భద్రతను తొలగించాలని ఓం బిర్లాకు విజ్ఞాపన పత్రం అందించారు. దీనికి సంబంధించిన ఫొటోను సురేశ్ ట్విట్ చేశారు.

Recommended Video

Farm Bills : సభలో తీవ్ర కలకలం.. కాంగ్రెస్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు! || Oneindia Telugu
చెప్పినట్టే చేసిన సురేశ్..

చెప్పినట్టే చేసిన సురేశ్..

రఘురామకు భద్రత తొలగించాలని స్పీకర్‌ను కోరతామని ఇదివరకే సురేశ్ స్పష్టంచేశారు. ఆ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. రఘురామకు భద్రత సిబ్బంది ఉంటే చెప్పినట్టు దాడులు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పులివెందులలో 10 వేల మందితో మీటింగ్ పెడతానని కామెంట్ చేయడం ఏంటీ అని సురేశ్ ప్రశ్నించారు. ఏం చేయాలనుకంటున్నావో.. నీకు అదే జరుగుతుంది అని హెచ్చరించారు. ఒకప్పుడు సీఎంను పొగిడి.. ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.

English summary
ycp mp nandigam suresh complains to lok sabha speaker om birla on ragjurama krishna raju
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X