• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చీడ, విష పురుగులు జగన్ చుట్టూ చేరాయి, సాయిరెడ్డి బెయిల్‌పై రఘురామ

|

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై రఘురామ కృష్ణంరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయమని సోమవారం సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు. చీడ పురుగులు, విష పురుగులు సీఎం జగన్మోహన్‌రెడ్డి దగ్గరకు చేరాయని మండిపడ్డారు. సీఎం దగ్గర ఉన్న చీడ పురుగులకు అదనంగా మరో చీడ పురుగు చేరింది అని ఎద్దేవా చేశారు.

ఉమాపై కక్షసాధింపే

ఉమాపై కక్షసాధింపే

టీడీపీ నేత దేవినేని ఉమ అరెస్టు, రాజమండ్రి జైలుకు తరలింపు అక్కడి సూపర్ డెంట్‌ను మార్చడం అనుమానాలకు దారితీస్తోందని రఘురామ అన్నారు. ఒక మంచి ఉద్దేశం ఉన్న ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కారులో ఉన్న వ్యక్తి దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేవినేనిపై 307 సెక్షన్ కేసు పెట్టాలంటే స్పాట్‌లో మారణాయూధాలు, గాయం అయి ఉండాలన్నారు. ఎలాంటి ఆయూధాలు లేకుండా ఒక్క రక్తపు మరక లేనప్పుడు దేవినేనిపై 307 సెక్షన్ కేసు ఎలా పెట్టారని నిలదీశారు. కేసు పెట్టి, జైలుకు తరలించి అక్కడి సూపర్‌టెండెంట్‌ను ఎందుకు ఆకస్మాత్తుగా మార్చారని రఘురామ ప్రశ్నించారు.

సీసీ కెమెరా..

సీసీ కెమెరా..

ఉమ ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. ఆయన రూమ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని లింక్‌ను మేజిస్ట్రేట్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని మానవ హక్కుల నాయకులు కానీ అక్కడి ప్రముఖులు ఎవరైనా ప్రతి రోజు దేవినేని ఉమ రూమ్‌ను సందర్శించేలా చూడాలన్నారు. చట్టాలు, సెక్షన్లు‌ను దుర్వినియోగం చేసి రాజకీయ ఒత్తిళ్లతో అన్యాయంగా కేసులు పెడితే అలాంటి పోలీసు అధికారులపై న్యాయ స్థానాలను ఆశ్రయించి కేసులు పెట్టాలని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్టంలో కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి బకాయిలు కూడా రావడం లేదని రఘురామ కృష్ణమరాజు అన్నారు.

  YS Jagan's Bail - Shocking Turn |Raghu Rama Krishnam Raju | CBI Court | Oneindia Telugu
  ఇటు జగన్

  ఇటు జగన్

  మరోవైపు జగన్ బెయిల్ రద్దు కోరుతూ రెండేళ్ల కిందటి వరకూ సీబీఐ పోరాడింది. కేసు గురించి మాట్లాడినందుకు ఓ మాజీ అధికారిపై చర్యలకు కూడా సిద్ధమైంది. జగన్ బెయిల్ రద్దు విషయంలో ఒకప్పుడు చిన్న ఘటనలకే ఉలిక్కిపడ్డ సీబీఐ... ఇప్పుడు మాత్రం నిమ్మకకు నీరెత్తినట్లు వ్యవహరించడం, చిన్న కాగితాన్ని కూడా సమర్పించలేని స్థితికి దిగజారడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఢిల్లీ నుంచి కాగితాలు రాలేదన్న కారణంతో వాయిదా కుదరదని మా లాయర్లు తెగేసి చెప్పడంతో సీబీఐ వాళ్లు టర్న్ తీసుకోక తప్పలేదు. ఎవరెవరికో ఫోన్లు చేసుకున్న తర్వాత.. పాత విధానానికే, అంటే, బెయిల్ రద్దు అంశం పూర్తిగా కోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు జడ్జిగారికి సీబీఐ లాయర్లు చెప్పారు.

  English summary
  ysrcp rebel mp raghu rama krishna raju hot comments on mp vijaya sai reddy. sai reddy bail to be cancelled he said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X