వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఎర్‌సీపీ

|
Google Oneindia TeluguNews

ట్రిపుల్ తలాక్‌ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైకాప రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. కాగా ఉదయం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాము బిల్లును వ్యతిరేకించినట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి, బిల్లును పున:పరీశీంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

మరోవైపు టీడీపీకి ఉన్న ఇద్దరు ఎంపీలు కూడ చర్చలో పాల్గనకపోవడంతో ఓటింగ్ దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ఇక టీఆర్ఎస్ పార్టీ సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.టీఆర్ఎస్ బిల్లును వ్యతిరేకించకపోయినా అందులో ఉన్న కొన్ని నిబంధనలును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ట్రిబుల్ తలాక్‌ చెప్పిన వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే భార్యలను ఎవరు పోషిస్తారన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అయితే ఇప్పటి వరకు బిల్లుపై ఎలాంటీ నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్ బిల్లుకు మద్దతు ఇస్తుందా లేదా అనేది మాత్రం అధికారికంగా స్పష్టం చేయలేదు.

YSRCP opposes triple talaq bill, will vote against draft law

ఇక తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభలో టీఆర్ఎస్‌కు ఆరుగురు ,వైసీపీకి ఇద్దరు, టీడీపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. మరోవైపు బిల్లును వ్యతిరేకిస్తూ జేడీయూ వాకౌట్ చేసింది. కాగా ఉదయం రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టారు.

English summary
ysrcp MP Vijayasai Reddy has made it clear that they will be opposed the triple talaq bill in Rajya Sabha. while MP Vijayasai Reddy was speaking in the debate on the bill,which is introduced in the Rajya Sabha in the morning. declared that he opposed the bill, asked the Center to reconsider.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X