వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ సారి బౌద్దారామంపై: ఏపీ సర్కార్‌పై నిప్పులు, విశాఖ తొట్లకొండను రక్షించుకోవాలి: ఎంపీ రఘురామ

|
Google Oneindia TeluguNews

విశాఖ తొట్లకొండలో గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. బౌద్ధారామం పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్‌తో మాట్లాడానని వెల్లడించారు. ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టొద్దని సూచించారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

తొట్లకొండ ప్రాంతంలో ఇతర నిర్మాణాలు చేపట్టొద్దు అని.. నిర్మిస్తే చారిత్రక ప్రాశస్త్యం అంతరించిపోతుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడానని పేర్కొన్నారు. ఇక్కడ గల బౌద్ధారామం ఆకృతులే ఇండోనేషియాలోని గోడో బుదూర్ ప్రాంతంలో ఉన్నాయని వివరించారు. అక్కడ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తుచేశారు. మనం కూడా ఇక్కడ గల బౌద్ధారామాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.

ysrcp rebel mp raghu rama slams ap govt..

Recommended Video

హిందూపూర్ ప్రజలకి Nandamuri Balakrishna భరోసా.. 55 లక్షల విరాళం!! | Oneindia Telugu

తొట్లకొండ ప్రాంతం రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలో ఉంది అని రఘురామ తెలిపారు. అయితే చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టడం సరికాదన్నారు. నిర్మాణాలు నిలిపివేయాలని.. లేదంటే ప్రాంతాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోనికి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారని తెలిపారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

English summary
ysrcp rebel mp raghurama krishna raju slams andhra pradesh government on totlakonda Buddhist Monument place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X