జగన్, ఎంపీలు ప్రధానిని కలువాలి, అయినా ప్రైవేటీకరణ జరిగితే..?: మోడీతో రఘురామ మీట్
వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించారు. దాదాపు 18 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించామని రఘురామ మీడియాకు తెలిపారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని కొనసాగించాల్సిందేనని స్పష్టంచేశారు.

ఎస్సీ, బీసీల భూములు..
అమరావతిలో అగ్రవర్ణాలు కాదు వెనకబడిన తరగతుల వారే ఎక్కువగా ఉన్నారని రఘురామ చెప్పారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోడీయేనని.. అందుకే ఆయనకు అన్నీ విషయాలు తెలియజేశానని చెప్పారు. ఎకరం, అర ఎకరం ఉన్న బీసీలు, ఎస్సీలు ఉన్నారని గుర్తుచేశారు. అమరావతిలో ఇప్పటికే రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని తెలియజేశారు. రాష్ట్రంలో జీతాలు ఇచ్చేందుకే నిధులు లేని పరిస్ధితి అని చెప్పారు. అలాంటి పరిస్థితిలో విశాఖపట్టణంలో రాజధాని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం ఆషామాషీ అనే విషయం తెలియదా అని అడిగారు.
జాంబిరెడ్డి హీరోయిన్ క్లీవేజ్ షో.. అందాలతో కవ్విస్తున్న యంగ్ హీరోయిన్

ఆలయాలపై దాడులు
ఆలయాలపై దాడుల గురించి కూడా డిస్కషన్ చేశానని రఘురామ తెలిపారు. ఒక మతాన్ని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని చెప్పారు. ఆలయాలపై జరుగుతోన్న దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా తమ మధ్య చర్చకు వచ్చిందని రఘురామ చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రజలు చేసిన త్యాగాన్ని గుర్తుచేశారు. విశాఖ వాసులకు ఉన్న అనుబంధం గురించి సవివరంగా ఎక్స్‌ప్లేన్ చేశారు. తాను చెప్పిన అన్నీ అంశాలను మోడీ సానుకూలంగా స్పందించారని రఘురామ తెలియజేశారు. స్టీల్‌ప్లాంట్‌పై మోదీ అభయం లభించినట్టుగానే భావిస్తున్నానని రఘురామ స్పష్టం చేశారు.

ఎంపీలతో కలిసి జగన్
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే విశాఖ పట్టణానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ఆ సిటీకి సంబంధించి అభివృద్ధి పనులు కొనసాగుతాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయానికి వచ్చే సరికి ప్రధాని మోడీని సీఎం జగన్, ఎంపీలు కలువాలని కోరారు. సీఎం కాదని అంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు అని చెప్పారు. జగన్ ప్రధానిని కోరినా.. ప్రైవేటీకరణ జరిగితే అందుకు బాధ్యులు సీఎం అవుతారని చెప్పారు. మరొకరిపై నెపం వేసే అవకాశం లేదని చెప్పారు.

ఏకగ్రీవమా..?
పంచాయతీ ఎన్నికలపై కూడా రఘురామ కామెంట్ చేశారు. ఒక నియోజకవర్గం ఏకగ్రీవం కావడం ఏంటీ అని అడిగారు. ఇదీ సరికాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. భయపెట్టి విజయం సాధించడం దేనికి సంకేతం అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇదీ మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డారు.