వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబ్బం హరి గోడ కూల్చివేత: అక్రమార్కులపై చర్యలేందుకు తీసుకోరు: రఘురామ కృష్ణరాజు

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి కూల్చివేతపై వివాదం రాజేసింది. సబ్బం హరి ఇంటిని అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీనిపై సబ్బం హరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు సబ్బం హరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా స్పందించారు. జగన్, ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

సమాచారం లేకుండా.. జేసీబీలతో వచ్చి

సమాచారం లేకుండా.. జేసీబీలతో వచ్చి

సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అదీ అక్రమ కట్టడం అని అధికారులు చెబుతున్నారు. అయితే అతనికి ముందుగా సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారు. జేసీబీలను తీసుకొచ్చి కూల్చివేశారు. అధికారుల తీరుపై సబ్బం హరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు. తమకు సమాచారం ఇవ్వకుండా జేసీబీలను ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.

నోటీసులు ఎందుకు ఇవ్వలే..

నోటీసులు ఎందుకు ఇవ్వలే..

ఏ అక్రమ కట్టడమైనా సరే నోటీసు ఇవ్వాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తెలిపారు. సబ్బం హరికి కనీసం సమాచారం ఇవ్వడం కూల్చడం మంచి పద్ధతి కాదన్నారు. ఇదే పేద మహిళ బాత్ రూమ్ సైతం కూల్చివేశారని తెలిపారు. ఎందుకిలా చేస్తున్నారని సీఎం జగన్‌ను రఘురామ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వందల కోట్లు నొక్కొశారని మండిపడ్డారు. ఇంటి నిర్మాణానికి పనికిరాని ఆవ భూములకు అధిక ధర ఎందుకు చెల్లించారని అడిగారు. దీంతో ఎవరికీ ప్రయోజనం జరిగిందని నిలదీశారు.

Recommended Video

'Play Back' మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్న Journalist Murthy !
అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోరు

అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోరు

సబ్బం హరి ఇంటి గోడ కూల్చడంతో మీకు ఒనగూరే ప్రయోజనం ఏంటీ అని అడిగారు. ఇదే స్పూర్తి అక్రమార్కులపై ఎందుకు చూపడం లేదు అని రఘురామ ప్రశ్నించారు. విపక్ష నేతల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. విపక్ష నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కానీ మీకు ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు.

English summary
ysrcp rebel mp raghurama krishna raju slams ap cm ys jagan mohan reddy on sabbam hari wall collapse issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X