వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టినరోజు నాడు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ .. ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

భారత మాజీ క్రికెటర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు పలికారు. అయితే రైతు నిరసనలపై తన తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేసిన ప్రసంగం పట్ల తాను బాధ పడ్డారు అని పేర్కొన్నారు. రైతులు, కేంద్రప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు యువరాజ్ సింగ్ ప్రకటించారు.

తీవ్రమవుతున్న రైతు ఉద్యమం .. ఢిల్లీ ఘెరావ్ ప్లాన్ .. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు పిలుపుతీవ్రమవుతున్న రైతు ఉద్యమం .. ఢిల్లీ ఘెరావ్ ప్లాన్ .. డిసెంబర్ 14 న దేశవ్యాప్త నిరసనకు పిలుపు

 తండ్రి వ్యాఖ్యలకు బాధ పడ్డానని చెప్పిన యువరాజ్ సింగ్

తండ్రి వ్యాఖ్యలకు బాధ పడ్డానని చెప్పిన యువరాజ్ సింగ్

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా, రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న సంఘర్షణను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆందోళనకు మద్దతుగా క్రీడాకారులు తమ అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు తన తండ్రి యోగ్ రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన బాధ పడ్డానని తెలిపారు. రైతులు దేశానికి జీవనాడి అని, శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తాను నమ్ముతున్నానని యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు.

పుట్టినరోజు నాడు రైతుల సమస్య పరిష్కారం కావాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్

పుట్టినరోజు నాడు రైతుల సమస్య పరిష్కారం కావాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్

పుట్టినరోజు నాడు అందరూ తమ కోరికలు నెరవేర్చుకుంటారని, అయితే తాను ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కంటే, రైతుల సమస్యలు పరిష్కరించడం ప్రధానమని నమ్ముతున్నానని పేర్కొన్నారు. రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని తాను కోరుకుంటున్నట్లుగా , పుట్టిన రోజు నాడు తన కోరిక నెరవేరాలని ఆశిస్తున్నట్టు గా యువరాజ్ సింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రైతుల డిమాండ్లను వినాలని యోగ్ రాజ్ సింగ్ సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన రైతులకు మద్దతునివ్వడానికి తమ అవార్డులను తిరిగి ఇస్తున్న క్రీడాకారులకు తాను మద్దతు ఇస్తున్నా అంటూ పేర్కొన్నారు. అయితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని యువరాజ్ సింగ్ స్పష్టం చేశారు.

 కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే తమ అవార్డులను తిరిగి ఇస్తామన్న క్రీడాకారులు

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే తమ అవార్డులను తిరిగి ఇస్తామన్న క్రీడాకారులు

మరోపక్క సింఘూ సరిహద్దు వద్ద రైతుల ఆందోళనలో చేరిన బాక్సర్ విజయేందర్ సింగ్, కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే తన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును తిరిగి ఇస్తానని చెప్పారు. మాజీ జాతీయ బాక్సింగ్ కోచ్ గుర్బక్ష్ సింగ్ సంధు కూడా రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు తన ద్రోణాచార్య అవార్డును తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో రైతుల పోరాటానికి తన మద్దతు తెలిపిన యువరాజ్ సింగ్ శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు.

 కరోనా సమయంలో జాగ్రత్త అంటూ యువరాజ్ సూచన

కరోనా సమయంలో జాగ్రత్త అంటూ యువరాజ్ సూచన

అంతేకాదు కోవిడ్ -19 'మహమ్మారి ఇంకా ముగియలేదు అని ప్రజలకు గుర్తు చేస్తూ యువరాజ్ సింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై పోరాడటానికి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు. జై జవాన్, జై కిసాన్! జై హింద్ అంటూ ముగించారు. మొత్తానికి అటు సినీ వర్గాల నుండి, క్రీడాకారుల నుండి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలకు విశేషంగా మద్దతు లభిస్తుంది .

English summary
Former cricketer Yuvraj Singh today took to social media to announce that rather than celebrating his birthday this year, he wished for a speedy resolution of the ongoing conflict between farmers and the Central government. He also distanced himself from remarks made by his father Yograj Singh endorsing the sportspersons returning their awards to support the agitation. In a statement he shared on Twitter, Yuvraj Singh said that "undoubtedly, farmers are the lifeblood of the nation and he believed that the problem could be resolved through peaceful dialogue."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X