వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యజువేంద్ర చాహల్‌పై కులం కామెంట్స్: యువరాజ్ సింగ్ అరెస్ట్..బెయిల్‌పై!

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. తన తోటి క్రికెటర్, టీమిండియా స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్.. అతని అరెస్ట్‌కు కారణం అయ్యాయి. హర్యానాలోని హిసార్ జిల్లా హన్సి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు మూడు గంటల పాటు విచారించారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యాడు.

గత ఏడాది ఓ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ‌తో సరదాగా నిర్వహించిన ఇంటర్వ్యూ సందర్భంగా యువరాజ్ సింగ్.. యజువేంద్ర చాహల్‌పై ఈ కామెంట్స్ చేశాడు. ఓ షెడ్యూల్డ్ కులాన్ని కించపరిచేలా అతను చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయంటూ అప్పట్లోనే దుమారం చెలరేగింది. హన్సీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లాక్‌డౌన్ సమయంలో యజువేందర్ చాహల్ ఇంట్లో ఖాళీగా గడుపుతున్నాడని, వీడియోలు షూట్ చేసుకుంటున్నాడని పేర్కొన్నాడు.

ఓ కులానికి చెందన మనుషుల్లా అతనికి పనీ పాట ఉండట్లేదని సరదాగా కామెంట్స్ చేశాడు. తమ కులాన్ని కించపరిచాడంటూ హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది.. యువరాజ్ సింగ్‌పై కేసుపై హన్సి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీలోని 153, 153ఎ, 295, 505, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని 3 (1), (ఆర్), 3 (1) (ఎస్) కింద కేసు నమోదు చేశారు.

Yuvraj Singh arrested and released on bail by Haryana police

ఈ కేసులో యువరాజ్‌ అరెస్ట్ అయ్యాడు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. అతనికి వెంటనే బెయిల్ లభించింది. విచారణను ఎదుర్కొన్న తరువాత యువరాజ్ సింగ్ విడుదల అయ్యాడు. అనంతరం తన సోషల్ మీడియా అకౌంట్స్ మీద దీనికి సంబంధించిన కొన్ని వివరాలను పోస్ట్ చేశాడతను. తన స్నేహితులతో సరదాగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూరకంగా చేసినవి కావని స్పష్టం చేశాడు.

ఒకరిని కించ పరచాలనేది తన ఉద్దేశం కాదని చెప్పాడు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. కాగా- విచారణ సందర్భంగా యువరాజ్ సింగ్ తమకు సహకరించాడని హిసార్ పోలీస్ సూపరింటెండెంట్ నికిత గెహ్లాట్ చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలతో కస్టడీలోకి తీసుకున్నామని, అనంతరం బెయిల్ లభించడంతో విడుదల చేశామని అన్నారు. కొందరు దళిత సొసైటీ సభ్యులు, న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుతో యువరాజ్ సింగ్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు.

English summary
Former Team India all rounder Yuvraj Singh was arrested and released on interim bail by Haryana Police for using a casteist slur against spinner Yuzvendra Chahal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X