వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్లో నాపై కుట్ర: రహస్య ప్రాంతం నుంచి మాట్లాడిన జకీర్ నాయక్
న్యూఢిల్లీ: భారత దేశంలో తన పైన కుట్ర జరుగుతోందని జకీర్ నాయక్ శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన రహస్య ప్రాంతం నుంచి స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడాడు.య తన ప్రసంగాలను కొంతమంది వక్రీకరిస్తున్నారని చెప్పాడు.
ముస్లీంలను ఉగ్రవాదం వైపు వెళ్లాలని తాను సూచించలేదని చెప్పాడు. ఇస్లాం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుందని తెలిపాడు.

ఫ్రాన్సులో ఉగ్రవాద దాడులను తాను ఖండిస్తున్నానని చెప్పాడు. డాకాలో జరిగిన దాడులకు నేను కారణం అని చెప్పడం సరికాదన్నాడు. నేను ఎప్పుడూ శాంతినే కోరుకుంటానని చెప్పాడు. తన పీస్ టీవీ ఛానల్ను ఎందుకు నిషేధించారో చెప్పాలన్నాడు.