వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.149 కోట్లు ఇచ్చి దాచిపెట్టమన్నాడు, జకీర్ నాయక్ కేసులో ఆసక్తికర అంశం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: వివాదాస్పద ఇస్లాం మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ కేసు విచారిస్తున్న పోలీసులకు మరో ఆసక్తికరమైన అంశం లభించింది. జకీర్ నాయక్ తన భాగస్వామికి భారీ మొత్తంలో డబ్బు అందజేసి దాచిపెట్టాలని కోరినట్లు తెలిసింది.

తనకు జకీర్‌ నాయక్‌ రూ. 148.9 కోట్లను దాచిపెట్టాలని ఇచ్చినట్టు ఆయన సహచరుడు, భాగస్వామి ఆమిర్‌ అబ్దుల్‌ మన్నన్‌ గజ్దార్‌ ఈడీ అధికారులకు తెలిపాడు. జకీర్ మేనేజర్ అస్లామ్‌ ఖురేషి తనకు ఈ డబ్బు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.

Zakir Naik's close aide reveals details, says was given Rs 149 crore for safekeeping

మత ప్రచారం పేరు చెప్పి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, అక్రమంగా డబ్బు కూడబెట్టడం వంటి నేరాలపై జకీర్ తో పాటు ఆయన నిర్వహిస్తున్న ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ పైనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా ఇటీవల అమీర్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించగా, గత ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్‌ మధ్య తనకు ఈ డబ్బు అందిందని వెల్లడించాడు. తాను దశలవారీగా ఈ మొత్తాన్ని తిరిగి తీసుకు వెళతానని అన్నాడని, నిఘా అధికారులకు తనపై అనుమానం వచ్చిన తరువాత, డబ్బు తన వద్ద దాచిపెట్టమని కోరాడని తెలిపాడు.

English summary
Mumbai: A close business associate of Islamic preacher Zakir Naik has told the National Investigation Agency (NIA) that he was given Rs 148.9 crore in cash by Naik's manager Aslam Qureshi between August and October 2016 for safekeeping, before it was taken away in instalments. Aamir Abdul Mannan Gazdar was arrested by the Enforcement Directorate (ED) in a money laundering case against Naik and Islamic Research Foundation (IRF). By this time, Naik was already in focus for his hate speeches that allegedly incited youth to commit terror acts, and was therefore on the radar of security establishments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X