వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'జికా': ఇలా వ్యాప్తి..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 'జికా' వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ముప్పు జికా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వైరస్ సోకిన కేసులు 40 లక్షలకు చేరవచ్చునని భావిస్తున్నట్లు గురువారం హెచ్చరించింది.

జికా వైరస్ వైగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న అత్యవసర సమావేశానికి డబ్ల్యూహెచ్‌వో అధినేత మార్గరెట్‌ చాన్‌ పిలుపునిచ్చారు. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి బాగా ఉందనీ, 23 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు అతను తెలిపారు. హెచ్చరికస్థాయి అత్యంత తీవ్రస్థాయిలో ఉందన్నారు.

వైరస్‌ వ్యాప్తి అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి స్థాయిగా పరిగణించవచ్చా అనే అంశాన్ని నిర్ధరించేందుకు సోమవారం డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రారంభంలో వ్యాధి నిద్రాణ స్థితిలో ఉంటూ, అంతగా ఆందోళన కలిగించకున్నా, ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయిందన్నారు.

జికా వైరస్‌తో మైక్రో సెఫలీ, గిలియన్‌-బేర్‌ అనే నాడీ సంబంధ రుగ్మత మధ్య సంబంధం రుజువు కాకపోయినా, బలంగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సమావేశంలో వ్యాప్తి తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు కోరనున్నట్లు చెప్పారు.

 Zika virus may be transmitted through infected blood or sexual contact

అత్యవసరంగా పరిశోధన చేపట్టాల్సిన ప్రాధాన్య రంగాల్ని గుర్తించడంపై దృష్టి పెడతారన్నారు. ఉత్తర దక్షిణ అమెరికాల్లో ముప్పై నుంచి నలభై లక్షల కేసులు ఉండవచ్చని భావిస్తున్నారు. దోమలు వెళ్లే ప్రతిచోటికీ జికా వైరస్‌ వెళ్తుందంటున్నారు.

వ్యాప్తి చెందేవరకూ మనం వేచి చూడొద్దని, జికాకు ఓ వాహకం అవసరం కాబట్టి, దోమల్ని నియంత్రించడం ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.

జికా వైరస్‌పై టీకాలు, చికిత్స పద్ధతుల్ని అత్యవసరంగా అభివృద్ధి చేయాలంటూ తమ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా పిలుపునిచ్చిన నేపథ్యంలో వైరస్‌పై పోరుకు అమెరికా సన్నద్ధమవుతోంది. అర్కాన్సాస్‌, వర్జీనియాల్లో ఒక్కో కేసు గుర్తించినట్లు అమెరికా సీడీసీ తెలిపింది. కాలిఫోర్నియాలో ఓ బాలికలో కేసు నిర్ధరణ జరిగినా కోలుకున్నట్లు తెలిపారు.

కాగా, జికా వైరస్ బ్రెజిల్, అమెరికా తదితర ప్రాంతాల్లో బాగా విస్తరిస్తోంది. జికా వైరస్ వల్ల పుట్టబోయే బిడ్డల్లో బ్రెయిన్ డామేజ్ అవుతుందని తెలుస్తోంది. దోమల వల్ల జికా విస్తరిస్తోంది. ఈ వ్యాధి విస్తరించకుండా ఉండేందుకు దోమలను అదుపు చేయాలని చెబుతున్నారు.

ఈ వ్యాధి ఓ రకం దోమల వల్ల వ్యాపిస్తుంది. డెగ్యూ, చికెన్ గున్యా వ్యాధిని కూడా ఇవే దోమల వల్ల వస్తోందని తెలుస్తోంది. ఈ జికా వైరస్ రక్తం మార్పిడి వల్ల జరుగుతుంది. అంతేకాదు సెక్సువల్ కాంటాక్ట్ వల్ల కూడా వ్యాప్తిస్తుందని చెబుతున్నారు.

English summary
The growing presence of Zika virus in Brazil, US has drawn international attention this month. The Zika virus is thought to cause brain damage in babies called microcephaly, a condition in which babies are born with abnormally small heads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X