వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు మరో గుడ్ న్యూస్, లిక్కర్ డెలివరీకి జొమాటో రెడీ..? ఇక ఇంటిముందుకే మందు..

|
Google Oneindia TeluguNews

మందుబాబులకు మరో తీపి కబురు. ఇప్పటికే వైన్ షాపులు తెరవడంతో చుక్క కోసం గంటల తరబడి నిరీక్షించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫుడ్ డెలివరీ సంస్థ.. జొమాటో మద్యం డెలివరీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.

సరుకులు..

సరుకులు..


జొమాటో ఇప్పటికే కిరాణా వస్తువులను కూడా అందజేస్తోంది. లాక్ డౌన్ వల్ల రెస్టారెంట్లు మూసివేయడంతో.. వినియోగదారులకు సరుకులు ఇస్తోంది. మార్చి 25వ తేదీన లాక్ డౌన్ అమలు కాగా.. లిక్కర్ షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే వైన్ షాపుల ముందు చాలా మంది నిల్చొవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. లిక్కర్‌పై ఢిల్లీ ప్రభుత్వం 70 శాతం సెస్ వేయగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది.

ఆన్ లైన్ డెలివరీ..

ఆన్ లైన్ డెలివరీ..

దేశంలో ప్రస్తుతం ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు చట్టపరమైన నిబంధణలు లేవు. కానీ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్లూఏఐ) మాత్రం జొమాటో ఇతర సంస్థల ద్వారా విక్రయాలు జరిపించాలని అనుకుంటోంది. లిక్కర్ హోం డెలివరీ ద్వారా మందు వినియోగం బాధ్యతయుతంగా జరుగుతోందని జొమాటో భావిస్తోంది. ఐఎస్‌డబ్లూఏఐతో వ్యాపార ప్రతిపాదనలతో జొమాటో సీఈవో మోహిత్ గుప్తా అభిప్రాయపడ్డారు.

25 ఏళ్ల వరకు..

25 ఏళ్ల వరకు..

దేశంలోని చాలా రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువతకు అనుమతి ఇస్తోంది. కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో డెలివరీ చేసేందుకు జొమాటో సిద్దంగా ఉంది అని రాయిటర్స్ నివేదించింది. కానీ దీనిపై జొమాటో యాజమాన్యం మాత్రం స్పందించలేదు. లిక్కర్ డెలివరీ ద్వారా రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతోందని ఐఎస్‌డబ్లూఏఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలో 27.2 బిలియన్ల లిక్కర్ కొనుగోలు జరుగుతోందని లండన్‌కు చెందిన ఐడబ్ల్యుఎస్ ఆర్ అంచనా వేసింది.

Recommended Video

AP CM Jagan Launched Fishermen Bharosa Scheme, Rs 10,000 To Beneficiaries
ఈబర్ ఈట్స్ కొనుగోలు

ఈబర్ ఈట్స్ కొనుగోలు

చైనాకు చెందిన అలీబాబా గ్రూపు అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్ మద్దతుతో జొమాటో దేశలో విస్తరిస్తోంది. జనవరిలో ఉబెర్ ఈట్స్ కూడా కొనుగోలు చేసింది. జొమాటో ప్రధాన ప్రత్యర్థి స్విగ్గీ.. దీనికి చైనాకు చెందిన టెన్సెంట్ సపోర్ట్ చేస్తోంది.

English summary
Food delivery company Zomato aims to branch out into delivering alcohol, according to a document seen by Reuters, as it seeks to cash in on high demand for booze during the coronaviruslockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X