వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెపటైటిస్ డ్రగ్‌తో కరోనాకు చెక్: గుజరాత్ ఫార్మా కంపెనీ: బిగ్ అనౌన్స్‌మెంట్: క్లినికల్ ట్రయల్స్ కోసం.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌కు భారత్ చెక్ పెట్టబోతోందా? దేశీయంగా టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ జైడస్ క్యాడిలా కరోనా వైరస్‌కు విరుగుడు డ్రగ్‌ను కనిపెట్టిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గుజరాత్‌ ప్రధాన కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో .. కరోనా వైరస్‌ చికిత్స కోసం డ్రగ్‌ను కనిపెట్టినట్లు ఫార్మారంగంలో టాప్ కంపెనీగా గుర్తింపు పొందిన జైడస్ క్యాడిలా వెల్లడించింది. తాము రూపొందించిన ఈ మెడిసిన్‌ను కరోనా వైరస్ సోకిన పేషెంట్లపై ప్రయోగించడానికి అవసరమైన క్లినికల్ ట్రయల్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించినట్లు పేర్కొంది.

న్యాయశాఖ ఉన్నతాధికారికి సోకిన కరోనా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు శాస్త్రీభవన్‌లో ప్రకంపనలు.. సీల్న్యాయశాఖ ఉన్నతాధికారికి సోకిన కరోనా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు శాస్త్రీభవన్‌లో ప్రకంపనలు.. సీల్

హెపటైటిస్ మిశ్రమాలతో

హెపటైటిస్ మిశ్రమాలతో

హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ డ్రగ్ మిశ్రమాన్ని వినియోగించి.. కరోనా వైరస్ కోసం డ్రగ్‌ను కనిపెట్టినట్లు పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి ప్రతిపాదనలను పంపించింది. డ్రగ్ కంట్రోలర్ కార్యాలయం నుంచి అనుమతి లభించిన వెంటనే క్లినికల్ ట్రయల్స్‌ను ఆరంభిస్తామని జైడస్ క్యాడిలా సంస్థ ఓ పేర్కొంది. కరోనా వైరస్ సోకిన పేషెంట్ ఆరోగ్య స్థితిగతులు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. ఈ డ్రగ్‌ను వినియోగించేలా తయారు చేయనున్నట్లు వెల్లడించింది.

పెగిహెప్ డ్రగ్

పెగిహెప్ డ్రగ్

ప్రస్తుతం దేశంలో హెపటైటిస్-బీ, హెపటైటిస్-సీ చికిత్స కోసం పెగిహెప్ డ్రగ్‌ను వినియోగిస్తున్నారు. పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ అల్ఫా-2బీ మెడిసిన్‌ను ఈ రెండింటి కోసం వాడుతున్నారు. హెపటైటిస్ వరకు ఈ ఔషధం అద్భుతంగా పని చేస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. దీనికి సంబంధించిన మిశ్రయాలను ఆధారంగా చేసుకుని కొత్తగా మరో డ్రగ్‌ను కనుగొన్నామని జైడస్ క్యాడిలా సంస్థ యాజమాన్యం చెబుతోంది. పెగిహెప్ ద్వారా కరోనా వైరస్‌ బారిన పేషెంట్లకు చికిత్స చేయడం వల్ల సత్ఫలితాలను వస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

చైనా, క్యూబాల్లో ఇదే తరహాలో..

చైనా, క్యూబాల్లో ఇదే తరహాలో..

కరోనా జన్మనిచ్చిన చైనా, క్యూబా దేశాల్లో హెపటైటిస్ డ్రగ్ మిశ్రమంతోనే ఆ వైరస్ సోకిన పేషెంట్లకు వైద్య చికిత్సను అందిస్తున్నారు. దీనిపై ఆయా దేశాల ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలను సైతం జారీ చేశాయి. తాజాగా మనదేశంలోనూ అదే తరహాలో హెపటైటిస్ డ్రగ్ మిశ్రమాలతో కరోనా వైరస్ పేషెంట్ల కోసం క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించడానికి అనుమతి కోరుతూ జైడస్ క్యాడిలా సంస్థ డీసీజీఏకు ప్రతిపాదనలను పంపించింది. ఈ విషయాన్ని డీసీజీఏ కార్యాలయం అధికారులు ధృవీకరించారు. జైడస్ క్యాడిలా సంస్థ రూపొందిచిన కొత్త డ్రగ్‌పై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.

నిపుణుల కమిటీ పరిశీలనలో ప్రతిపాదనలు..

నిపుణుల కమిటీ పరిశీలనలో ప్రతిపాదనలు..

జైడస్ క్యాడిలా సంస్థ ప్రతిపాదనలను పరిశీలించడానికి డీజీసీఏ కార్యాలయం ప్రత్యేకంగా నియమించిన నిపుణుల కమిటీని నియమించిందని తెలిపారు. ఈ కమిటీ ప్రస్తుతం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించడానికి మరికొంత సమయం పడుతుందని తేల్చి చెప్పారు. పెగిలేటెడ్ ఇంటర్‌ఫెరాన్ అల్ఫా-2బీ మెడిసిన్‌ను మిశ్రమం ద్వారా యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ మెడికల్ బ్రాంచ్ పరిశోధనలను చేస్తోంది. హెపటైటిస్ డ్రగ్‌తో కరోనాకు చికిత్స చేయడానికి గల మార్గాలను అన్వేషిస్తోంది.

English summary
The country's top drug regulator, Drug Controller General of India (DCGI), has received an application from Zydus Cadila, the leading global pharmaceutical company in India, to conduct clinical trial using antiviral drug 'Pegylated Interferon Alpha-2b' in adult COVID-19 patients. So far in India, the Pegylated Interferon Alpha-2b medicine has been used for the treatment of Hepatitis B and C. It is important to note that the drug -- Pegylated Interferon Alpha-2b has been used in the treatment of COVID-19 in China and Cuba and is a part of the treatment guidelines of the Chinese government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X