వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: కిమ్ వెనుక ఆ రెండు దేశాలు, కట్టడి చేయాలి: అమెరికా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను కట్టడి చేయాలని రష్యా, చైనాలను అమెరికా కోరింది. ఉత్తరకొరియా తాజాగా రెండు ఖండాంతర క్షిపణుల పరీక్షలు నిర్వహించింది. దీంతో అమెరికా రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని కోరింది.

ట్రంప్‌కు కిమ్ షాక్: అమెరికాను బూడిద చేస్తాం: ఉ. కొరియా ట్రంప్‌కు కిమ్ షాక్: అమెరికాను బూడిద చేస్తాం: ఉ. కొరియా

Recommended Video

North Korea Drag China into Trouble కొరియాతో డేంజర్‌లో చైనా: ఆ ప్రయోగం జరిగితే నాశనమే!|Oneindia

ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్నా కానీ, ఉత్తరకొరియా ఏ మాత్రం తగ్గడం లేదు. ఉత్తరకొరియాపై భద్రతా మండలి ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉత్తరకొరియా జపాన్, అమెరికాలను తీవ్రంగా హెచ్చరించింది.

ఈ హెచ్చరికలను నిజం చేస్తూ రెండు ఖండాంతర క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించింది. దీంతో ఉత్తరకొరియాను కట్టడి చేయాల్సిన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని అమెరికా భావించింది.

షాక్: కిమ్ తల నరికేందుకు 3 వేల మంది కమెండోలుషాక్: కిమ్ తల నరికేందుకు 3 వేల మంది కమెండోలు

ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు తమ ముందున్న అన్ని రకాల మార్గాలను అమెరికా అన్వేషిస్తోంది. ఈ మార్గాలన్నింటిని అమలు చేసేందుకు అమెరికా వ్యూహరచన చేస్తోంది.

కిమ్‌ను కట్టడి చేయాలని రష్యా, చైనాలకు అమెరికా వినతి

కిమ్‌ను కట్టడి చేయాలని రష్యా, చైనాలకు అమెరికా వినతి

తాజాగా ఉత్తరకొరియా రెండు ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో అమెరికా రంగంలోకి దిగింది. కొరియాపై తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. కొరియాను కట్టడి చేయాలని రష్యా, చైనాలను కోరింది అమెరికా. కొరియా అధ్యక్షుడు కిమ్ దూకుడు కారణంగా ప్రపంచదేశాలన్ని భయబ్రాంతులకు గురౌతున్నాయని అమెరికా అభిప్రాయపడింది.

ఉ.కొరియాపై చర్యలకు దిగాలని అమెరికా పిలుపు

ఉ.కొరియాపై చర్యలకు దిగాలని అమెరికా పిలుపు

ఖండాంతర క్షిపణి దాడులతో ప్రపంచాన్ని వణికిస్తోన్న ఉత్తరకొరియాపై నేరుగా చర్యలకు దిగాలని రష్యా, చైనాలను అమెరికా కోరింది. కిమ్ దూకుడుకు కళ్ళెం వేస్తారా? లేదా? అని అమెరికా ప్రశ్నించింది. కొరియాను నిలువరించకపోతే ప్రపంచమే పెను ప్రమాదంలో పడే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.

చైనా నుండే ఇంధనం సరఫరా

చైనా నుండే ఇంధనం సరఫరా

ఉత్తరకొరియాకు చైనా నుండే పెద్ద మొత్తంలో ఇంధనం సరఫరా అవుతోందని అమెరికా ఆరోపించింది. ఉత్తర కొరియా కార్మికులకు రష్యా ఆశ్రయం కల్పిస్తోందని అమెరికా ప్రకటించింది. ఈ రెండు దేశాలు తమ అసహనాన్ని ప్రదర్శంచాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా సూచించింది.

ఒంటరిగా మారనున్న ఉత్తరకొరియా

ఒంటరిగా మారనున్న ఉత్తరకొరియా

హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అణుపరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తరకొరియా దౌత్యపరంగా , ఆర్థికపరంగా ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఈ మేరకు అమెరికా అధికారి రెక్స్ టిల్లర్ సన్ ప్రకటించారు.

English summary
The United States on Thursday called on China and Russia to take "direct actions" to rein in North Korea after it fired a ballistic missile over Japan into the Pacific.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X