వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1.7 లక్షల ట్వీట్టర్ అకౌంట్స్ సస్పెండ్, చైనాకు అనుకూలంగా పోస్టులు చేయడంతో చర్యలు...

|
Google Oneindia TeluguNews

చైనా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న 1.7 లక్షల ఖాతాలను ట్వీట్టర్ సస్పెండ్ చేసింది. ఆయా అకౌంట్ల నుంచి చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు వస్తున్నట్టు గుర్తించి, చర్యలు తీసుకున్నామని వివరించింది. ఇందులో ఎక్కువగా హాంకాంగ్ నిరసనలకు వ్యతిరేకంగా, కరోనా వైరస్ విపత్తు గురించి పోస్టులు ఉన్నాయని తెలిపింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అనుకూలంగా వీరు పనిచేస్తున్నారని 'సీఎన్ఎన్' రిపోర్ట్ చేసింది.

చైనా స్వరాలకు నేపాల్ తోకజాడింపు.. భారత్‌పై విషం కక్కిన ప్రధాని ఓలి.. భూఆక్రమణకు శపథం..చైనా స్వరాలకు నేపాల్ తోకజాడింపు.. భారత్‌పై విషం కక్కిన ప్రధాని ఓలి.. భూఆక్రమణకు శపథం..

 వీపీఎన్ ద్వారా కనెక్ట్..

వీపీఎన్ ద్వారా కనెక్ట్..

యూజర్లు చైనాకు అనుకూలమైన భౌగోళిక రాజకీయ కథనాలు పోస్ట్ చేస్తున్నారని... సోషల్ మీడియా నియమాలను ఉల్లంఘించినందుకు ఖాతాలను సస్పెండ్ చేసినట్టు తెలిపింది. ఇకపై సదరు యూజర్లు ఎలాంటి పోస్టులు చేయలేరు అని పేర్కొన్నది. వాస్తవానికి చైనాలో ట్వీట్టర్ ఖాతాలను నిలిపివేశామని.. కానీ అక్కడ వీపీఎన్ ద్వారా కనెక్ట్ అవుతున్నాని తెలిపింది. చైనా భాషలో ట్వీట్స్ రావు అని.. కానీ వారు వీపీఎన్ ద్వారా లాగిన్ అవుతున్నారని చెప్పింది.

విదేశాల్లో ఉన్న వారితో..

విదేశాల్లో ఉన్న వారితో..

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా విదేశాల్లో ఉన్న చైనీయులకు పార్టీ విస్తరణ బాధ్యతలను అప్పగించిందని ఆస్ట్రేలియాకు చెందిన స్ట్రాజటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ పేర్కొన్నది. ఇలా 23 వేల 750 ఖాతాలు అధికశాతం ప్రభావితం చేశాయని పేర్కొన్నది. ఇందులో మరో 15 వేల అకౌంట్స్ చైనాకు అనుకూలంగా పనిచేశాయని.. రీ ట్వీట్లు కూడా చేశాయని తెలిపింది. 23 వేల 750 అకౌంట్ల నుంచి 3 లక్షల 48 వేల 608 సార్లు ట్వీట్ చేశారని స్టాన్ ఫర్డ్ పరిశోధకులు తెలిపారు.

గతేడాది 1000

గతేడాది 1000

ఇప్పుడే కాదు గతేడాది ఆగస్టులో కూడా ట్వీట్టర్ వెయ్యి ఖాతాలను తొలగించింది. హంకాంగ్‌లో రాజకీయ అసమ్మతి సృష్టించే ప్రయత్నం చేస్తుందని అకౌంట్లను సస్పెండ్ చేసింది. రష్యా, టర్కీతో ముడిపడి ఉన్న అకౌంట్లను కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది.

English summary
1.7 lakh accounts on the microblogging site Twitter were suspended on Thursday for posting and sharing information which were termed as deceptive narratives that favoured the Chinese government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X