వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30లో ఒకరికి స్ట్రెయిన్.. లండన్‌లో సిచుయేషన్ సిరీయస్: మేయర్ ఆందోళన

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ స్ట్రెయిన్ అల్లాడిస్తోంది. స్ట్రెయిన్ అంటేనే బ్రిటన్ వణికిపోతోంది. స్ట్రెయిన్ విపత్తు అని.. లండన్ ఆస్పత్రులు త్వరలో నిండిపోతాయని మేయర్ సాదిక్ ఖాన్ తెలిపారు. స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని ఆయన అన్నారు. త్వరలో ఆస్పత్రుల్లో బెడ్స్ నిండిపోతాయని అంచనా వేశారు.

స్ట్రెయిన్ ఇప్పటికే వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. తమకు బ్రిటన్ ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరారు. లండన్‌లో స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అందుకోసమే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నామని.. లేదంటే మరణాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

1 In 30 Now Has Covid: London Mayor Declares Major Incident

లండన్‌లో ప్రతీ 30 మందిలో ఒకరికి స్ట్రెయిన్ ఉందని ఖాన్ తెలిపారు. అలాగే వైరస్ సోకిన వారి సంఖ్య 27 శాతం పెరిగిందని వివరించారు. వెంటిలేటర్ సంఖ్య కూడా 42 శాతం పెరిగిందని చెప్పారు. స్ట్రెయిన్ వ్యాపిస్తోన్న క్రమంలో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఖాన్ అభిప్రాయపడ్డారు. కఠిన నిర్ణయం తీసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కోరారు.

లండన్‌లో స్వీయ నియంత్రణలో ఉన్నవారికి సాయం చేయాలని కోరారు. ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. వ్యాక్సిన్ డేటా.. ఫేస్ మాస్క్ తప్పనిసరిగా అందజేయాలని కోరారు. లండన్‌లో పరిస్థితి క్రమక్రమంగా చేయి దాటిపోతుందని చెప్పారు.

English summary
London mayor Sadiq Khan on Friday declared a major incident, warning hospitals in the British capital could soon be overwhelmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X