• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంహెచ్ 370 ఇంకా మిష్టరీయే, శాస్త్రవేత్తల ఆశలు: పాఠాలు నేర్పింది

By Srinivas
|

కౌలాలంపూర్: 239 మంది ప్రయాణీకులు, క్రూ మెంబర్స్‌తో బీజింగ్ నుండి టేకాఫ్ అయిన ఎంహెచ్ 370 విమానం గల్లంతై నేటికి ఏడాది పూర్తి అయింది. గత ఏడాది మార్చి 8వ తేదీన బీజింగ్ నుండి బయలుదేరిన ఈ విమానం ఆ తర్వాత గల్లంతయింది. దీని ఆచూకి ఇప్పటికీ వెలుగు చూడలేదు. అది ఎక్కడ కూలిపోయిందనేది ఇంకా మిస్టరీగానే ఉంది.

ఈ విమానం ఇండియన్ ఓషియన్‌లో కూలినట్లుగా భావిస్తున్నారు. ఆస్ట్రేలియాకు పశ్చిమాన ఇది కూలి ఉండవచ్చునని పరిశోధకులు భావించారు. ఆ ప్రాంతంలో సముద్రం అడుగు భాగానికి సంబంధఇంచి 2,00,520 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రేఖా చిత్రాల్లో బంధించగలిగారు.

ఈ వివరాలతో కూడిన త్రీడీ మ్యాపుల కోసం ఇప్పుడు ప్రపంచ శాస్త్రజ్ఞులు ఎదురు చూస్తున్నారు. 60వేల కిలోమీటర్ల ఏరియా పరిధిలో ఎక్కైడనా కూలిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇందులో నలభై శాతం వరకు అన్వేషించారు. పూర్తి అన్వేషణ మే నెలాఖరు వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు.

1 year on, investigators still hopeful about finding MH370

ఎంహెచ్ 370 అన్వేషణ ఇంఛార్జ్.. ఆస్ట్రేలియన్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ పీటర్ ఫోలే మాట్లాడుతూ.. తాము సరైన దిశలోనే వెళ్తున్నామని, త్వరలో ఆపరేషన్ పూర్తవుతుందని భావిస్తున్నామని చెప్పారు. తమ సెర్చ్ సిస్టమ్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ కూలిందో కచ్చితంగా గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మలేషియా, చైనా, ఆస్ట్రేలియాలు ఏప్రిల్‌లో భేటీ అయి ప్రియారిటీ జోన్ కాకుండా మరెక్కడైనా వెతకాలా అనే విషయమై చర్చించి, నిర్ణయం తీసుకుంటాయి.

ఎంహెచ్ 370... పాఠాలు

టెక్నాలజీ ఎంతగా పెరుగుతున్న గల్లంతైన ఒక విమానాన్ని మాత్రం కనుక్కోలేకపోవడం గమనార్హం. ఏడాది పూర్తయినప్పటికీ ఎంహెచ్ 370 ఎక్కడ కూలిందో గుర్తించలేకపోతున్నారు. ఎంహెచ్ 370లో ఇందులో ఎన్నో ప్రశ్నలు, దాని ద్వారా ఎన్నో పాఠాలు.

ఆ విమానం కూలిందా, కూలితే శకలాలు తేలాలి, అలా కాకపోయినా ప్రయాణీకుల మృతదేహాలు పైకి తేలాలి. అందులో ఏదీ ఇప్పటి వరకు గుర్తించలేదు. ఆహోరాత్రులు శ్రమించినా జాడ దొరకలేదు. ఈ అన్వేషణ శాస్త్రవేత్తలకు కొత్త పాఠాలు నేర్పింది.

ఖండాంతరాలు దాటుతూ గంటలకొద్ది ప్రయాణించే విమానాలకు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు.. ఈ నేపథ్యంలో మెరుగైన ట్రాకింగ్ వ్యవస్థ అవసరమని, 15 నిమిషాలకొకసారి విమానాల స్థితిగతులను తెలుసుకునే వ్యవస్థ ఇండాలని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఆదేశించింది. ప్రస్తుతం ఈ అప్ డేట్స్ ప్రతి అరగంట నుండి నలభై నిమిషాలకు ఒకసారి అందుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It's been a year since the MH370 had disappeared soon after taking off from the Malaysian capital for Beijing and all efforts to trace the missing aircraft carrying 239 people on board have proved to be futile. On March 8, the plane had vanished less than a hour after taking off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more