వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెనడాలో ఆగంతకుడి నరమేధం: గ్యాస్ స్టేషన్‌లో చొరబడి కాల్పుల మోత, 10 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

కెనడాలో ఆగంతకుడు బీభత్సం సృష్టించాడు. నోవా స్కోటియాలో ఆర్సీఎంపీ గ్యాస్ స్టేషన్ వద్ద తుపాకీతో కాల్పుల మోత మోగించాడు. కాల్పుల్లో 10 మంది వరకు చనిపోయారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని కెనడా పోలీసు అధికారులు పేర్కొన్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాబ్రియేల్ వోర్ట్‌మన్ చనిపోయాడని ధృవీకరించారు.

గాబ్రియల్ ఆర్సీఎంపీ గ్యాస్ స్టేషన్‌ల‌ోకి రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు అధికారిగా ప్రవేశించారు. తర్వాత విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో 10 మంది, ఆపై వరకు చనిపోయారని ఆర్సీఎంపీ చీఫ్ సూపరింటెండెంట్ క్రిస్ లెథర్ తెలిపారు. ఇక్కడ ఇదివరకు జరిగిన దారుణ హత్యలకు కూడా గ్యాబ్రియల్ కారణం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

10 killed in shooting rampage in Canada, suspect dead..

చనిపోయిన వారిలో మహిళ పోలీసు అధికారి కూడా ఉన్నారు. హెడి స్టీవెన్ సన్ అనే మహిళ.. గత 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు ఉండగా.. వారు తల్లిని కోల్పోయారు. గ్యాబ్రియల్ ఎందుకు దాడిచేశారనే అంశం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరగడంతో వెంటనే అక్కడికీ చేరుకున్నామని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Recommended Video

Dating Resumes To Genie Bouchard, Asks Her Fans Not to Send

గాబ్రియల్ గ్యాస్ స్టేషన్ వద్దకు పోలీసు దుస్తుల్లో, పోలీసులు కారులో వచ్చాడని.. కానీ తర్వాత పోలీసులు జరిగింది వివరించారు. సిల్వర్ చెవల్రెట్ ఎస్‌యూవీలో వచ్చాడని పేర్కొన్నారు. కానీ అతను ఆర్సీఎంపీ ఉద్యోగి కూడా కాదని వివరించారు. కెనడాలో కాల్పులపై ప్రధాని జస్టిన్ ట్రూడ్ సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలిసి తన గుండె బద్దలవుతోందని ప్రకటనలో తెలిపారు.

English summary
51-year-old Gabriel Wortman went on a shooting rampage across the northern part of the Canadian province of Nova Scotia Sunday, killing at least 10 people, including a policewoman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X