వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

103 ఏళ్ల వృద్దుడి మారథాన్: 30 రోజుల్లో 42.2 కిలోమీటర్లు, 6 వేల యూరోలు కలెక్ట్, ఎందుకంటే.? (వీడియో)

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్‌కు విరుగుడు మందు కనిపెట్టడంతో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. అయితే వైరస్ పరిశోధనల కోసం 103 ఏళ్ల శతాధిక వృద్దుడు ముందుకొచ్చాడు. ఆయన వైరస్ కోసం అన్వేషణ చేయడం లేదు గానీ.. నిధులు సమకూర్చేందుకు లేట్ వయస్సులో మారథాన్ నిర్వహిస్తున్నాడు. రోజు కొంత దూరం తన గార్డెన్‌లో నడుస్తూ మారథాన్‌ను లాంఛనంగా ప్రారంభించాడు.

ఆదర్శం

ఆదర్శం


స్వచ్చంద సంస్థ కోసం బ్రిటన్‌కు చెందిన శతాధిక వృద్దుడు మారథాన్ నిర్వహించడమే తనకు ఆదర్శమని రిటైర్డ్ డాక్టర్ అల్పోన్స్ లింపొయెల్స్ పేర్కొన్నారు. ఈశాన్య బ్రస్సెల్స్‌లో గల రొటెస్టర్ మున్సిపాలిటీలో గల తన గార్డెన్ వద్ద ఈ నెల 1వ తేదీన మారథాన్ ప్రారంభించాడు. 42.2 కిలోమీటర్ల దూరాన్ని ఈ నెల 30వ తేదీన పూర్తిచేయాలని భావిస్తున్నాడు. ప్రతీ రోజు ఉదయం, మధ్యాహ్నాం, సాయంత్రం పూట తన గార్డెన్‌లో వాక్ చేస్తున్నాడు. అయితే చేసిన ప్రతీసారి మరచిపోకుండా ఉండేందుకు గిన్నేలోకి చిన్న కర్ర వేసి లెక్కబెట్టుకుంటున్నాడు.

మారథాన్

మారథాన్

రెండో ప్రపంచ యుద్దం సమయంలో బ్రిటన్‌కు చెందిన టామ్ మూర్ (100) తన గార్డెన్ చుట్టూ తిరిగి 40 మిలియన్ల అమెరికా డాలర్లు సేకరించారని లింపొయెల్స్ తెలిపారు. ఇదే తనకు ఆదర్శంగా నిలిచిందని.. తన పిల్లలతో చెబితే టామ్ మూర్ లాగా తాను కూడా నడవగలుగుతానని తన పిల్లలు తెలిపారని చెప్పారు. ఈ మేరకు తాను రన్ ప్రారంభించానని తెలిపారు.

6 వేల యూరోలు


లింపొయెల్స్ ఇప్పటివరకు 6 వేల యూరోలను సమకూర్చాడని లెవెన్ వర్సిటీ తెలిపింది. అతని మారథాన్ మూడింట ఒకవంతు పూర్తయ్యిందని తెలిపింది. 1957-58లో ప్లూ వచ్చిందని.. కానీ కరోనా వైరస్ వల్ల వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. ఓ వైద్యుడిగా తాను నడవాలని అనుకొన్నానని.. అందుకే మారథాన్ ప్రారంభించానని తెలిపారు.

English summary
103-year-old Belgian doctor is walking a marathon around his garden in daily stages to raise money for research into the new coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X