వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: కరోనా విలయం, అమెరికాలో భారత సంతతికి చెందిన 11 మంది మ‌ృతి, 16 మందికి...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తోంది. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 14 వేలు దాటింది. అయితే అమెరికాలో భారత సంతతికి చెందిన వారు కూడా మృతుల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పలువురికి వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

అమెరికాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4 లక్షల మార్క్ దాటింది. అగ్రరాజ్యంలో 11 మంది భారత సంతతికి చెందిన వారు చనిపోయారు. మరో 16 మంది వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకి చనిపోయిన 16 మంది పురుషులేనని అమెరికా అధికారులు పేర్కొన్నారు. న్యూయార్క్‌కి చెందిన వారు 10 మంది ఉండగా, న్యూజెర్సీకి చెందినవారు నలుగురు ఉన్నారు. న్యూయార్క్‌లో ఉన్న వారు ట్యాక్సీ నడుపుకొని జీవించేవారు అని అధికారులు తెలిపారు.

11 Coronavirus Infected Indians Die In US, 16 More Test Positive

న్యూయార్క్‌లో సిచుయేషన్ క్రిటికల్‌గా ఉంది. వైరస్ సోకి 6 వేల మంది చనిపోగా.. లక్ష 38 వేల మందికి పాజిటివ్ వచ్చింది. న్యూజెర్సీలో 48 వేల మందికి వైరస్ సోకగా.. 1500 మంది చనిపోయారు. ఫ్లోరిడాలో మరొ భారత సంతతికి చెందిన వ్యక్తి చనిపోయారని అధికారులు తెలిపారు. మిగతావారు కాలిఫోర్నియా, టెక్సాస్‌లో నివసిస్తున్నారని తెలిపారు. వైరస్ సోకిన 16 మందిలో నలుగురు మహిళలు ఉన్నారు. వారంత స్వీయ నిర్బంధంలో ఉన్నారని అధికారులు వివరించారు. న్యూయార్క్‌కు చెందిన వారు 8, న్యూజెర్సీ నుంచి ముగ్గురు.. మిగతా వారు టెక్సాస్, కాలిఫొర్నియాకు చెందినవారు అని పేర్కొన్నారు.

అమెరికాలో వైరస్ సోకిన వారి కోసం చికిత్స అందించేందుకు అమెరికా అధికారులతో భారత రాయబార కార్యాలయ అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.

Recommended Video

కరోనా వైరస్ : America Reported 1,858 In Single Day, A Record High

English summary
11 Indians have died of COVID-19 in the United States with another 16 testing positive for the infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X