వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇంటికి వచ్చిన అనుకోని అతిథి.. షాక్‌కు గురైన బామ్మ

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: అది అమెరికాలోని ఫ్లోరిడా నగరం. సమయం తెల్లవారుజామున 3 గంటలు. నగరమంతా గాఢ నిద్రలో ఉన్నారు. 77 ఏళ్ల మేరీ విష్చుసెన్‌ కూడా ఆదమరచి నిద్రపోతోంది. ఒక్కసారిగా మేరీ ఇంట్లో చిన్న శబ్దం మొదలైంది. అయినప్పటికీ ఆమె నిద్రనుంచి మేల్కొనలేదు. మళ్లీ ఏదో చప్పుడైంది. అప్పటికీ కళ్లు తెరవలేదు. చిన్నగా ఆ శబ్దం మరో గది నుంచి వినిపించింది. ఈసారి కాస్త పెద్ద శబ్దమే వినిపించింది. ఇక మేరీకి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది. శబ్దం ఎక్కడి నుంచి వస్తోందంటూ నిద్రలేచింది.

సమయం చూడగా అప్పటికి 3:30 గంటలు కావొస్తోంది. ఈ సమయంలో శబ్దం ఎవరు చేస్తున్నారో చూద్దామని చిన్నాగా అడుగులు వేసుకుంటూ గదివైపునకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేరు. ఎవరక్కడా అంటూ కేకలు వేస్తూ కిచెన్ వైపు కదిలింది. అంతే ఒక్కసారిగా షాక్‌కు గురైంది.కిచెన్‌ వైపు వెళ్లిన మేరీ ఒక్కసారిగా షాక్‌ ఎందుకైందో తెలుసా..? ఆమె చూసింది గజ దొంగను కాదు ఒక పెద్ద మొసలిని. ఆ మొసలి దాదాపు 11 అడుగులు ఉంటుందని మేరీ చెప్పారు. మేరీని కూడా ఆ మొసలి అదేపనిగా చూసినట్లు తెలిపింది.

11 foot Alligator enters the kitchen room in Florida house

అదేదో తన సొంత పెంపుడు జంతువులా ఆ మొసలి ఫీల్ అయ్యిందని మేరీ చెప్పుకొచ్చారు. ఒక వైపు మొసలి కళ్ల ఎదురుగా ఉండటంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయింది. ఇక ఏమి చేయాలో తెలియక చిన్నగా తన ఫోన్ ఉన్న వైపు అడుగులు వేసింది మేరీ. వెంటనే భయంతో పోలీసులకు ఫోన్ చేసింది. మేరీ ఫోన్ చేసిన పది నిమిషాలకు పోలీసులు ఆమె ఇంటికి చేరుకున్నారు. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు.

పోలీసులు పట్టుకుంటున్న సమయంలో ఆ మొసలి ముప్పుతిప్పలు పెట్టింది. ఒకానొక సమయంలోవారిపైకి దాడిచేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే కిచెన్‌లోని సామాన్లు ధ్వంసం అయ్యాయి. మొసలి ఇంట్లో చేసిన బీభత్సాన్ని ఫ్లోరిడా పోలీసులు వీడియో తీశారు. ఆ సమయంలో ఓ వైన్ బాటిల్ కిందకు పడిపోయింది. దీంతో ఆ ఫ్లోర్‌ అంతా రక్తాన్ని తలపించింది. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఎర్రగా కనిపించేది రక్తం కాదని మొసలి వైన్‌బాటిల్‌ను కిందకు పడేసిందని చెప్పారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగానే ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజెన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ రాశారు. ఇక తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు ఆ భారీ మొసలిని పట్టుకుని జంతుసంరక్షణ శాలకు తరలించారు. దీంతో మేరీ ఊపిరి పీల్చుకుంది.

English summary
A homeowner in Florida was surprised when she found out that an 11-foot alligator had broken into her kitchen early Friday morning. According to a CNN report, 77-year-old Mary Wischhusen was woken up at around 3.30 am by a loud crash at her house in Clearwater, Florida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X