వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 దేశాల్లో నో కరోనా: ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు: యూఎన్‌వో

|
Google Oneindia TeluguNews

కరోనా పేరు చెబితే గుండెల్లో గుబులు రేగాల్సిందే. అసలు వైరస్ సోకని ప్రాంతం అంటూ ఏదీ లేదు. అని ప్రపంచంలో 12 దేశాల్లో మాత్రం కరోనా వైరస్ పేరు వినిపించడం లేదు. ఆశ్చర్యంగా ఉన్న ఇదీ నిజం. కరోనా వైరస్‌కి సంబంధించి ఐక్యరాజ్యసమితి 193 దేశాలను గుర్తించింది. అయితే 12 దేశాల్లో మాత్రం జూలై 19వ తేదీ ఆదివారం నాటికి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నది.

12 countries dont have coronavirus positive cases

ఉత్తరకొరియా, పలావు, సమోవా, వనాటు, టువాలు, మార్షల్‌ దీవులు, పలావు, నౌరు, కిరిబాటి, మైక్రోనేషియా, సోలమన్‌ దీవులు, టోంగా దేశాల్లో ఒక్క కరోనా వైరస్‌ కేసు నమోదు కాలేదు. ఈ దేశాలు చాలా వరకు ఓషియానియాలోని పసిఫిక్‌ మహాసముద్ర ద్వీపదేశాలే కావడం విశేషం. ఇప్పటివరకు కోటికి పైగా కేసులు, 6 లక్షలకు పైగా మరణాలతో ప్రపంచం తల్లడిల్లిపోతోండగా.. 12 దేశాల్లో వైరస్ లేకపోవడం సానుకూల అంశమే.

Recommended Video

#Watch COVID Asymptomatic Patients Flash Mob| Pune Girl Grand Welcome to Sister- Videos Viral

చైనాలో కరోనా వ్యాప్తి జరుగుతోందని తెలియగానే ఉత్తర కొరియా సరిహద్దులు పూర్తిగా మూసేసి తమ దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. తుర్క్ మెనిస్థాన్ కూడా మొదట్లోనే చైనాతో విమానాలు రద్దు చేసింది. మిగతా దేశాలతో గల సరిహద్దులను మూసివేసింది. విదేశాల నుంచి వచ్చేవారికి పసిఫిక్ ద్వీప దేశాల కఠిన నిబంధనలు అమలు చేశాయి. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి ఇస్తూ.. కఠిన నిబంధనలను అమలు చేసింది. దీంతో పాజిటివ్ కేసులు నమోదు కాలేదని యూఎన్‌వో పేర్కొన్నది.

English summary
12 countries don't have coronavirus positive cases uno said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X