వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడు సామాన్యుడు కాదు .. స్టాక్ మార్కెట్ లో ఓ పన్నెండేళ్ళ బుడతడి పెట్టుబడి, అవాక్కయ్యేలా ప్రాఫిట్

|
Google Oneindia TeluguNews

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం, షేర్లు కొనుగోలు చేయడం, స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనుకోవడం మామూలు విషయం కాదు. కానీ పన్నెండేళ్ల వయసున్న దక్షిణ కొరియా కు చెందిన క్వాన్ జూన్ దినచర్య మాత్రం ఇదే. ఎప్పుడు వ్యాపార వార్తలు చూడడం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అతని అభిరుచి . గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో స్టాక్ మార్కెట్ పై దృష్టి పెట్టిన క్వాన్ జూన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు.

క్రికెట్ లో కెప్టెన్ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదు, ప్లీజ్ ఫోకస్: అధికారులకు బూస్ట్ ఇచ్చేలా జగన్ కామెంట్స్క్రికెట్ లో కెప్టెన్ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదు, ప్లీజ్ ఫోకస్: అధికారులకు బూస్ట్ ఇచ్చేలా జగన్ కామెంట్స్

 స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడిపై ఏడాదిలో ప్రాఫిట్ 43% సంపాదించిన బుడతడు

స్టాక్ మార్కెట్ లో పెట్టిన పెట్టుబడిపై ఏడాదిలో ప్రాఫిట్ 43% సంపాదించిన బుడతడు

12 ఏళ్ల వయసున్న ఈ బుడతడు స్టాక్ మార్కెట్ లో 43% తాను పెట్టిన పెట్టుబడిపై ప్రాఫిట్ సంపాదించడంతో ఇతనే తరువాత వారెన్ బఫ్ఫెట్ అని మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
క్వాన్ గత ఏప్రిల్‌లో ట్రేడింగ్ ఖాతా తెరవడానికి తల్లిదండ్రులను ఒప్పించి 16 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. స్టాక్ మార్కెట్ లో ఆ బుడతడు వేసిన అడుగులు ఏకంగా 43% లాభాలను తెచ్చి పెట్టాయి. స్వల్పకాలిక పెట్టుబడులపై కాకుండా, దీర్ఘకాలిక పెట్టుబడి పై దృష్టిసారించిన క్వాన్ తల్లిదండ్రులతో మాట్లాడానని , వారి సూచనలతోనే, ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నానని చెప్పారు.

ట్రేడింగ్ లో తన రోల్ మోడల్ వారెన్ బఫెట్ అంటున్న దక్షిణ కొరియా బుడతడు

ట్రేడింగ్ లో తన రోల్ మోడల్ వారెన్ బఫెట్ అంటున్న దక్షిణ కొరియా బుడతడు

ట్రేడింగ్ లో తన రోల్ మోడల్ వారెన్ బఫెట్ అని చెప్పారు. యూఎస్ బిలియనీర్ పెట్టుబడిదారుని ప్రస్తావిస్తూ ఒక పన్నెండేళ్ల బుడతడు క్వాన్ చేసిన వ్యాఖ్యలు అతని కలను స్పష్టం చేశాయి .
స్వల్పకాలిక ఫోకస్డ్ డే ట్రేడింగ్ కాకుండా, నా పెట్టుబడిని 10 నుండి 20 సంవత్సరాలు దీర్ఘకాలిక దృక్పథంతో ఉంచాలనుకుంటున్నాను, నా రాబడిని పెంచాలని ఆశిస్తున్నాను అంటూ క్వాన్ వ్యాఖ్యానించటం విశేషం . దక్షిణ కొరియా లో చాలా మంది పిల్లలు ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

 కరోనా లాక్ డౌన్ సమయంలో దక్షిణ కొరియాలో మార్కెట్ లో చిన్నారుల ఇన్వెస్ట్ మెంట్స్

కరోనా లాక్ డౌన్ సమయంలో దక్షిణ కొరియాలో మార్కెట్ లో చిన్నారుల ఇన్వెస్ట్ మెంట్స్

దక్షిణ కొరియా యొక్క రూకీ ఇన్వెస్టర్ .. బహుమతులు, మినీ-కార్ బొమ్మలు మరియు రన్నింగ్ వెండింగ్ మెషీన్ల నుండి సేకరించిన నిధులతో బ్లూ చిప్ షేర్లలో పెట్టుబడి పెడుతూ ఉండడం విశేషం. ఇక 12 ఏళ్ల బుడతడు వన్ 16 లక్షల రూపాయలు మూలధనంగా పెట్టుబడి పెట్టి ప్రపంచంలోనే లీడింగ్ సంస్థలైన కోకోకోలా , శాంసంగ్, హుండాయ్ షేర్లను కొనుగోలు చేశాడు. సంవత్సర కాలంలోనే వాటి ధర ఊహించనివిధంగా పెరగడం, 43 శాతం లాభం రావడం విశేషం.

English summary
Watching the business news first thing is a new routine for 12-year-old South Korean Kwon Joon, as he dreams of becoming the next Warren Buffett after earning stellar returns of 43% from a hobby picked up just last year: buying stocks. Kwon pestered his mother to open a retail trading account last April with savings of 25 million won ($22,400) as seed money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X